ఆయన బతికే ఉన్నారు..!!

ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఇన్నాళ్లుగా విపరీతమైన  ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన చనిపోయారన్న పుకార్లు కూడా షికారు చేశాయి. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా సహా మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

Last Updated : May 2, 2020, 08:44 AM IST
ఆయన బతికే ఉన్నారు..!!

ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై ఇన్నాళ్లుగా విపరీతమైన  ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన చనిపోయారన్న పుకార్లు కూడా షికారు చేశాయి. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా సహా మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

ఐతే మీడియా, సోషల్ మీడియా ప్రచారాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఉత్తర  కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ప్రజా బాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన అనారోగ్యంతోపాటు ఆయన చనిపోయారన్న వార్తలన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని సుంచియాన్ అనే పట్టణంలో జరిగిన ఓ ఫర్టిలైజర్ ప్లాంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతోపాటు ఉత్తర కొరియా ఉన్నతాధికారులు,  ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఉన్నారు. 

కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారు

ఫర్టిలైజర్ ప్లాంటును ఆయన ప్రారంభించారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు 20 రోజుల తర్వాత ఆయన ప్రజలకు కనిపించడం విశేషం.  ఏప్రిల్ 11 నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుండె సమస్యలకు సంబంధించి  శస్త్ర చికిత్స  చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఆరోగ్యం విషమించి చనిపోయాడన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారు

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News