Arvind kejriwal: కొత్త రైతు చట్టాలు రైతులకు మరణ శాసనాలే
Arvind kejriwal: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగుతోంది. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని అభివర్ణించారు.
Arvind kejriwal: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కొనసాగుతోంది. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలని అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాల( New farm laws) కు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళన( Farmers protest) కొనసాగుతోందనే విషయం తెలిసిందే. రైతు ఆందోళనలో భాగంగా వివిధ ప్రాంతాల్లో రైతు సభలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో జరిగిన కిసాన్ మహా పంచాయత్ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. కొత్త రైతు చట్టాలపై మరోసారి మండిపడ్డారు. ఆ చట్టాలు రైతులకు మరణ శాసనాల్లాంటివని కేజ్రీవాల్ విమర్శించారు. రైతులకు సహాయం చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని.. రైతుల భూమిని పెత్తందార్లకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని తెలిపారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగుచట్టాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారుతారని స్పష్టం చేశారు.
కొత్త సాగు చట్టాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని..కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రధాని మోదీ ( Pm Modi) చెప్పడం మూడు నెలలుగా జరుగుతున్న రైతుల పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకేనని అరవింద్ కేజ్రీవాల్ ( Arvind kejriwal) స్పష్టం చేశారు. మరోవైపు యూపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. సొంత రాష్ట్రంలో రైతుల సమస్యల్ని పట్టించుకోకుండా కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు మద్దతివ్వడం సిగ్గుచేటని యోగీ ప్రభుత్వాన్ని( Yogi government) దుయ్యబట్టారు. గత రెండేళ్లుగా యూపీలోని చెరకు రైతులకు చెల్లింపు ధర విషయంలో భరోసా ఇవ్వడం లేదంటే ఆయన పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు.
Also read: PM Modi on PSLV C 51 Success: కొత్త శకానికి..కొత్త ఆవిష్కరణలకు నిదర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook