Aryan khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్(Aryan khan) ఓ క్రూయిజ్ నౌకలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసు(Drugs Case)లో అరెస్టైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత, ఆర్యన్‌ను అక్టోబర్ 8న ఆర్థర్ రోడ్ జైలు(Arthur Road jail)లో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం న్యాయవాదులు బెయిల్ కోసం పదేపదే ప్రయత్నించినప్పటికీ, ఆర్యన్ బెయిల్ పిటిషన్(Aryan khan bail petition) తిరస్కరణకు గురైంది. డ్రగ్స్ కేసు(Drugs Case)లో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ముంబై కోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ అధికారులు(NCB Officials) జైలులో విచారణతోపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. తాజాగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆర్యన్ అధికారులతో పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. 


Also read: Maharashtra: దాడులెందుకు..ధైర్యముంటే నేరుగా పోరాడమని సవాలు విసిరిన ఉద్ధవ్ థాక్రే


జైలు నుంచి విడుదల అయిన తర్వాత పేదలు, అణగారిన వర్గాలకు చేయూతనిస్తానని.. ఏదో ఒకరోజు తనను చూసి గర్వపడేలా చేస్తానంటూ అధికారులకు ఆర్యన్ మాటిచ్చాడని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇకనుంచి చెడు మార్గంలో పయనించనని బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారుఖ్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ శనివారం ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి