VAT On Petrol And Diesel: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలో వ్యాట్‌ తగ్గించాయని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది. 10 రాష్ట్రాలు మాత్రం తమ పరిధిలోని వ్యాట్‌ను తగ్గించలేదని తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉన్నట్లు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ తగ్గించడంవల్ల ఇదివరకటితో పోలిస్తే లీటర్‌ పెట్రోల్‌ ధర పంజాబ్‌లో రూ.16.02, లద్ధాక్‌లో రూ.13.43, కర్ణాటకలో రూ.13.35 తగ్గినట్లు పెట్రోలియంశాఖ తెలిపింది. కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్‌ తగ్గింపు తర్వాత లద్ధాఖ్‌లో డీజిల్‌ లీటర్‌కు గరిష్ఠంగా రూ.19.61, కర్ణాటకలో రూ.19.49, పుదుచ్చేరిలో రూ.19.08 మేర తగ్గుదల నమోదైనట్లు పేర్కొంది.


ప్రస్తుతం గరిష్ఠంగా జైపుర్‌లో రూ.108.39, విశాఖపట్నంలో రూ.107.48 ధర పలుకుతున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, దిల్లీ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాజస్థాన్‌, ఉన్నాయని వెల్లడించింది.


Also Read: Covid-19 Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ రద్దు చేయనున్న రైల్వేశాఖ


Also Read: Sabarimala Temple Opening: నవంబరు 16 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం.. భక్తులు పాటించాల్సిన నియమాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook