Sabarimala Temple Opening: నవంబరు 16 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం.. భక్తులు పాటించాల్సిన నియమాలివే..

Sabarimala Temple Opening: శబరిమల ఆలయం నవంబరు 15 నుంచి తెరుచుకోనుంది (Sabarimala Temple Opening Dates). రెండు నెలల పాటు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 08:25 AM IST
    • నవంబరు 15న తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
    • నవంబరు 16 నుంచి దర్శనానికి భక్తులకు అనుమతి
    • భక్తులు పాటించాల్సిన నియమాలను వెల్లడించిన ఆలయ అధికారులు
Sabarimala Temple Opening: నవంబరు 16 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం.. భక్తులు పాటించాల్సిన నియమాలివే..

Sabarimala Temple Opening: నవంబరు 15 నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుంది (Sabarimala Temple Opening Dates). 2 నెలల పాటు వర్చువల్ క్యూ విధానంలో రోజుకు 30వేల మంది భక్తులకు అనుమతించనున్నారు (sabarimala temple timings). నవంబరు 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో మరో అర్చకుడు వీకే జయరాజ్ ఆలయ గర్భ గుడిని తెరుస్తారు.

అయ్యప్పస్వామి ఆలయం, మల్లికాపురం ఆలయాలకు కొత్తగా ఎంపిక చేసిన అర్చుకులను.. అధికారికంగా నియమించే ప్రక్రియ అదే రోజు రాత్రి జరగనుంది. 16వ తేదీ నుంచి భక్తులకు అనుమతినిస్తారు. డిసెంబర్ 26న మండలపూజ ముగుస్తుంది. డిసెంబర్ 30న మకరవిళక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2022 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులు కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సిందేనని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.

భక్తులు పాటించాల్సినవి..

కరోనా నిబంధనలు (Sabarimala Covid Protocol) అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య భక్తులు ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. ఇందుకు సంబధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి (Sabarimala Visit 2021). కరోనా వాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు కొవిడ్ సర్టిఫికేట్ చూపించాలి. లేకపోతే శబరిమలను సందర్శించుకునే 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాలి, ఆ నెగిటివ్ రిపోర్టును అధికారులకు సమర్పించాలి. అదే విధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు హెల్త్ చెకప్ చేయించుకుని ఆలయానికి రావాలి. ఒరిజినల్ ఆధార్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.

పంపాలో స్నానానికి అనుమతి ఉంది. కానీ పంపా, సన్నిధానంలో బస చేసేందుకు అనుమతులు లేవు. పంపాలో వాహనాలకు పార్కింగ్ వెసులుబాటు కూడా ఉండదు. వాహనాలకు నీలక్కల్ వరకే అనుమతి ఉంటుంది. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. దర్శనం ముగించుకున్న వెంటనే ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలి. కాలి నడకన వచ్చే భక్తులు.. స్వామి అయ్యప్పన్ రోడ్డును మాత్రమే ఉపయోగించుకోవాలి. నెయ్యాభిషేకం కోసం భక్తులు తీసుకొచ్చే నెయ్యిని సేకరించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడే నెయ్యిని తిరిగి ఇస్తారు. దర్శనం తర్వాత ప్రసాదం కోసం పంపా వద్ద ఏర్పాట్లు చేశారు.

Also Read: Covid-19 Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ రద్దు చేయనున్న రైల్వేశాఖ

Also Read: Aadhaar Download: హుర్రే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP లేకుండానే ఆధార్‌కార్డ్ డౌన్‌లోడ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News