ఒంటరిపోరని బీజేపీ సంకేతాలు; శివసేన కౌంటర్
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధంకండి అని మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చిన మరుసటి రోజే బీజేపీపై శివసేన విమర్శలు గుప్పించింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధంకండి అని మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చిన మరుసటి రోజే బీజేపీపై శివసేన విమర్శలు గుప్పించింది. బీజేపీ హిందుత్వ అజెండాకు, తమ అజెండాకు అస్సలు పోలికే లేదని పేర్కొంది.
గత నాలుగేళ్లుగా దేశంలో కొనసాగుతున్న హిందుత్వాన్ని తాము అంగీకరించమని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే తన సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బీజేపీ హయాంలో గత నాలుగేళ్లుగా ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని.. ఆవులకు మాత్రం రక్షణ లభిస్తోందని చెప్పారు. 'నేన్ను కామన్ మ్యాన్ డ్రీమ్ కోసం పనిచేస్తాను.. మోదీ డ్రీమ్ కోసం కాదు' అని ఉద్ధవ్ థాక్రే అన్నారు. గతంలో బహిరంగంగా బీజేపీకి మద్దతు పలికామని, ఇప్పుడు కూడా బహిరంగానే విమర్శిస్తున్నామని థాక్రే తెలిపారు. బీజేపీ ధన బలం, ఈవీఎంల టాంపరింగ్ ద్వారా ఎన్నికల్లో విజయం సాధిస్తోందన్నారని ఆరోపించారు.
అవిశ్వాస తీర్మానం సందర్భంగా శివసేన ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఈ క్రమంలో లోక్‌సభకు వచ్చే ఏడాది జరుగున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉండాలని తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.