Covid Caller Tune: దేశంలో దాదాపు రెండేళ్ల తర్వాత కరోనా కేసులు అత్యల్ప స్థాయికి చేరాయి. రోజువారి కొవిడ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కాలర్​ ట్యూన్​ను త్వరలో నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏమిటి ఈ కాలర్​ ట్యూన్​..


దేశంలో కొవిడ్ విజృంభణ తర్వాత.. ప్రతి ఒక్కరికి ఈ మహమ్మారి గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. టీవీల్లో ప్రకటనలు ఇవ్వడం సహా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఫోన్​ చేసిన ప్రతిసారి కొరోనా జాగ్రత్తలు తెలుపే విధంగా ఓ కాలర్​ ట్యూన్​ను తీసుకొచ్చిది. ఆ తర్వాత అర్హులంతా వ్యాక్సినేషన్ తీసుకునేలా ప్రోత్సహిస్తూ కాలర్ ట్యూన్​ను అప్​డేట్ చేసింది. ఇలా ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి కాలర్​ ట్యూన్​లో మార్పులు చేసింది.


ఫోన్ చేసిన ప్రతిసారి ఈ కాలర్​ ట్యూన్ ముగిసిన తర్వాతే.. కాల్​ కలిసేది. అయితే అత్యవసర సమయాల్లో.. కాలర్​ ట్యూన్ మోగిన తర్వాతే కాల్ కనెక్ట్​ అవ్వడం పట్ల చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. ఈ విషయాన్ని పలు మార్లు సంబంధించి వర్గాల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే కొవిడ్ విఙృంభణ కారణంగా కాలర్​ ట్యూన్​ను తొలగించలేదు ప్రభుత్వం.


అయితే ఎట్టకేలకు.. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా తగ్గటం.. అర్హుల్లో అత్యధికశాతం టీకాలు తీసుకోవడం వంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్లే.. ఈ నెల తర్వాత మాస్క్​ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం మినహా.. మిగతా అన్ని కొవిడ్​ ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇక ఇదే సమయంలో కొవిడ్ కాలర్​ ట్యూన్​కు కూడా స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Also read: Attack on CM: సీఎం భద్రతలో లోపం.. దాడికి యత్నించిన యువకుడు!


Also read: Shiva Lingam: కోర్టుకు హాజరైన శివ లింగం.. నెట్టింట్లో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook