New covid-19 Guidlines: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. మన దేశంలో అదుపులోనే ఉంది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించారు. ఐతే మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటివి తప్పక పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందించింది.
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రెండేళ్ల క్రితం కట్టడి కోసం నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత వైరస్ ప్రభావం బట్టి పలుమార్లు నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేశారు. ఐతే గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈక్రమంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
కరోనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కృషి చేశాయని కేంద్ర హోంశాఖ గుర్తు చేసింది. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య క్రమేపి తగ్గుతున్నాయని.. అందుకే నిబంధనలు పొడగించాల్సిన అవసరం లేదని.. రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. వైరస్ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేమని.. కేసుల సంఖ్య పెరిగితే స్థానిక ప్రభుత్వాలు తిరిగి నిబంధనలు విధించొచ్చని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
Also Read: Kamareddy Crime: దారుణం... నిద్రిస్తున్న అక్కపై మరుగుతున్న నూనె పోసిన చెల్లెలు...
Also Read: Ashleigh Barty Retires: అతిచిన్న వయసులోనే టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన యాష్లే బార్టీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook