హైదరాబాద్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ.. మరో మారు తనదైన శైలిలో బీజేపీపై పదునైన విమర్శలు సంధించారు. ఈ సారి బీజేపీ చీఫ్ అమిత్ షాను టార్గెట్ చేస్తూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఎన్నికల ర్యాలీని పురస్కరించుకొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా యోగీ సర్కార్ ఊరి పేర్ల మార్పు అంశాన్ని ప్రస్తావిస్తూ దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'షా' అనేది ఫారసీ పదం..


ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ యూపీలోని  ఇలాహాబాద్, ఫైజాబాద్ ఊరి పేర్లను బీజేపీ వారు మార్చారు కదా ..మరి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేరు ఎప్పుడు మార్చుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ముస్లిం కమ్యూనిటీ పేర్లు ఉన్నాయనే ఉద్దేశంతో అలాహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గాను .. ఫైజాబాద్ ను అయోధ్య పేరు పెట్టారు కదా..మరి అమిత్ షా పేరులోని చివరి అక్షరం 'షా' ఫారసీ భాషలోని పదం కదా.. కాబట్టి అమిత్ షా.. తన పేరు ఎప్పుడు మార్చుకుంటున్నారని ప్రశ్నించారు.  ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ  దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు సవాల్ విసిరారు.


నాకూ ఓ గోవును ఇస్తారా ? - బీజేపీకి ఓవైసీ సూటి ప్రశ్న


ఈ సందర్భంగా ఓవైసీ బీజేపీ తెలంగాణ మేనిఫెస్టోపై విమర్శలు సంధించారు.  రాష్ట్రంలో లక్ష ఆవులను పంపిణీ చేస్తామని  ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ..అధికారంలోకి వస్తే తనకూ ఓ గోపు ఇవ్వగలదా అంటూ ఎద్దేవ చేశారు. ఇది నవ్వుకునే అంశం కాదని... తాను సీరియస్ గానే అడుగుతున్నానని... దీనిపై బీజేపీలో ఆలోచించుకోని చెప్పాలని డిమాండ్ చేశారు..