Asani Cyclone: మండు వేసవిలో తుపాను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ప్రభావంతో అండమాన్ దీవుల్లో అప్రమత్తత జారీ అయింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని తరలిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణంలో పెనుమార్పులకు సంకేతమే మండు వేసవిలో తుపాను ప్రభావంమని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఈ అల్పపీడనం పోర్ట్ బ్లెయిర్‌కు 100 కిలోమీటర్లు దూరంలో దక్షిణ ఆగ్నేయంగా 2 వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడి..ఉత్తర దిశగా పయనించనుంది. రేపు సాయంత్రానికి తుపానుగా మారనుండటంతో..అసనీగా నామకరణం చేశారు. అసనీ తుపాను క్రమంగా ఉత్తర దిశగా పయనిస్తూ..మయన్మార్, బంగ్లాదేశ్ తీరానికి చేరుకోనుంది. 


తుపాను ప్రభావంతో అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. తీరం వెంబడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోని లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేసి..ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రక్షణ కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాల్ని రంగంలో దింపుతున్నారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే అండమాన్ సముద్రప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. దాంతో..మత్స్యకారుల్ని వేటకు వెళ్లవద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. పలు పర్యాటక ప్రాంతాల్ని మూసివేశారు. తుపాను కచ్చితంగా ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది ఇంకా నిర్ధారణ కాలేదు కానీ..యతీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా. 


Also read: Imran Khan on India: భారత్‌పై..ఎన్డీయే ప్రభుత్వ విధానాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప్రశంసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook