న్యూ ఢిల్లీ: కరోనావైరస్‌ (coronavirus)ని ఎదుర్కోవాలంటే.. ఎండలో 15 నిమిషాలు కూర్చుంటే చాలు వైరస్‌తో పోరాడేందుకు సరిపోయేంత వ్యాధి నిరోధక శక్తి (Immunity power) వస్తుంది.. దెబ్బకు కరోనావైరస్‌ పోతుంది అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబె (Ashwini Choubey). అవును.. నిత్యం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండలో కూర్చుంటే శరీరానికి విటమిన్ డి (Vitamin D) సమకూరుతుందని.. తద్వారా వ్యాధి నిరోధక శక్తి వృద్ది చెంది అది కరోనా లాంటి వైరస్‌లను చంపేస్తుందని కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబె సెలవిచ్చారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఉండే ఎండ వేడి అధికంగా ఉంటుంది కనుక కరోనావైరస్ చనిపోతుందని కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబె అభిప్రాయపడ్డారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కరోనా వైరస్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 8,000లకు పైగా మందిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో.. కరోనావైరస్ గురించి ఎలాపడితే అలా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అర్థంపర్థం లేని సలహాలు ఇవ్వకూడదంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు సూచించిన కొన్ని గంటల్లోపే అశ్విని చౌబే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాకుండా ఇలాచేస్తే కరోనావైరస్ చస్తుంది.. లేదంటే అలా చేస్తే వైరస్ పోతుంది అంటూ దయచేసి ఉచిత సలహాలు ఇవ్వకండంటూ ప్రధాని మోదీ అందరికీ విజ్ఞప్తిచేసిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..