Assembly Elections 2021: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఓ వైపు ఓటర్లు , మరోవైపు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో( Kerala Assembly Elections) ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అటు పాలక్కాడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి, మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది అర్హులైన ఓటర్లున్నారు. 957 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా ముమ్మరంగా సాగుతోంది. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్(Kamal Haasan), ఆయన కుమార్తెలు, శృతి హాసన్, అక్షర హాసన్‌లు చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటుడు సూర్య, అతని తమ్ముడు కార్తీ సైతం ఓటు వేశారు. 


పుదుచ్చేరి(Puducherry) లో ఉదయం నుంచే పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. యానాం అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఓటు వేశారు. తమిళనాడు ( Tamilnadu)లో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో మాత్రం మూడవ విడత పోలింగ్ ప్రారంభమైంది. అస్సాంలో చివరి దశ పోలింగ్ జరగుతోంది. పుదుచ్చేరి, కేరళ, తమిళనాడులలో ఒకే దశలో పోలింగ్ జరగనుంది.  మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.


Also read: Good news: వాహనదారులకు, సామాన్యులకు ఊరట.. తగ్గనున్న Petrol, diesel, LPG ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook