Green signal for Oxford vaccine clinical trials in India: న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ( AstraZeneca-Oxford ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ 19 కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( covishield vaccine ) క్లినికల్ ట్రయల్స్‌ భారత్‌లో మళ్లీ పున:ప్రారంభం కానున్నాయి. ఇటీవల కాలంలో ఈ కరోనా (Coronavirus) వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో.. చివరి దశ ప్రయోగాలకు భారత్‌తో సహా అన్నీ దేశాల్లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్‌తో ఎలాంటి ప్రమాదం లేదంటూ క్లీన్ చిట్ రావడంతో అన్నిచోట్ల మళ్లీ పరీక్షలు మొదలయ్యాయి. కానీ భారత్‌లో మాత్రం ప్రయోగాలు ప్రారంభం కాలేదు.. ఈ క్రమంలో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCI) నుంచి అనుమతి లభించింది. రేపటినుంచి (సోమవారం) పుణేలోని సస్సూన్ ఆసుపత్రి (Sasssoon Hospital) లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వైద్యులు, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) వెల్లడించింది. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ కోసం చాలామంది వాలంటీర్లు ముందుకొచ్చారని, సుమారు 150మందిపై ప్రయోగాలు నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు. Also read: Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం


ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి, మార్కెటింగ్ మాత్రం భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) చేపట్టనుంది. ఈ నేపధ్యంలో భారత్ లో మూడోదశ ప్రయోగాల్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ చేపట్టగా.. బ్రిటన్‌లో ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్య తలెత్తడంతో ఈ నెల 9న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేశారు. అనంతరం దీనిపై ఆస్ట్రాజెనెకా సైతం వివరణ ఇచ్చి, ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎపెక్ట్‌లు తలెత్తలేదని, ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలో భారత్‌లో డీజీసీఐ అనుమతితో రేపటినుంచి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పున:ప్రారంభం కానున్నాయి. Also read: MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ