Atiq Ahmed, Ashraf’s Murder Case: ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు.. అందరూ ఆ పోలీస్ స్టేషన్ సిబ్బందే
Atiq Ahmed, Ashraf’s Murder Case Latest News Updates: అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ హత్యల వెనుక నిందితుల మోటివ్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేయగా.. కేవలం పబ్లిసిటి కోసమే తాము అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ సోదరులను కాల్చిచంపినట్టు తెలిపారు.
Atiq Ahmed, Ashraf’s Murder Case Latest News Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహించినట్టుగానే అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ హత్యలకు సంబంధించి ఆరోజు విధుల్లో ఉన్న ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్ ప్రదేశ్ సర్కారు ఆదేశాలు జారీచేసింది. సస్పెండ్ అయిన వారిలో షాగంజ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అశ్వని కుమార్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్స్, ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. సస్పెండ్ అయిన ఐదుగురు అధికారులు అందరూ ప్రయాగ్‌రాజ్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని షాగంజ్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారే కావడం గమనార్హం.
అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ సోదరులు హత్యకు గురైంది ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజ్ వద్ద కాగా ఆ మెడికల్ కాలేజ్ ఇదే షాగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఉమేష్ పాల్ అనే న్యాయవాదిని మర్డర్ చేసిన కేసులో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాఫియా డాన్ అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ సోదరులను వైద్య పరీక్షల నిమిత్తం ఏప్రిల్ 15న ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజీకి తరలిస్తుండగా.. జర్నలిస్టులు ముసుగులో వచ్చిన ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ సోదరులను దారుణంగా హతమార్చారు.
కాల్పులు జరిగిన చోటే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న ప్రయాగ్ రాజ్ పోలీసులు.. వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ హత్యల వెనుక నిందితుల మోటివ్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేయగా.. కేవలం పబ్లిసిటి కోసమే తాము అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ సోదరులను కాల్చిచంపినట్టు తెలిపారు. అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ వంటి మాఫియా డాన్లను పోలీసుల సమక్షంలోనే కాల్చి చంపితే.. తమ ప్రాబల్యం పెరుగుతుందని భావించినట్టు ముగ్గురు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టుగా మీడియాలో వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి : Atiq Ahmed, Ashraf Ahmed Shot Dead: ఆతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మెద్‌లని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపిన దుండగులు
అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులైన 23 ఏళ్ల సన్ని సింగ్, 22 ఏళ్ల లవ్లేష్ తివారి, 18 ఏళ్ల అరుణ్ మౌర్యలను బుధవారమే కోర్టు నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఏప్రిల్ 23 వరకు ముగ్గురు నిందితులు పోలీసు కస్టడీలోనే ఉండనున్నారు. అతిక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ మర్డర్ కేసు విచారణ చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి వాంగ్మూలం సేకరించింది. త్వరలోనే కాల్పులు జరిగిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి : Atiq Ahmed Killers' Motive: అతిక్ అహ్మద్ సోదరులను అందుకే చంపాం.. అసలు విషయం చెప్పిన కిల్లర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK