రామజన్మభూమి ఆలయ ( Ram janmabhumi )  నిర్మాణ శంకుస్థాపన తేదీ ఫిక్స్ అయింది. ప్రధాని మోదీ ( Pm Modi ) చేతుల మీదుగా భూమిపూజకు ముహూర్తం ఖరారైంది. ట్రస్ట్ పంపించిన రెండు తేదీల్లో ఒక తేదీని ఫైనల్ చేసినట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వివాదాస్పద రామజన్మభూమి అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ( Supreme court verdict ) అనంతరం చకచకా పనులు సాగుతున్నాయి. కరోనా వైరస్ , లాక్ డౌన్ కారణంగా చాలాకాలం స్తబ్దత నెలకొన్న విషయం తెలిసిందే. తిరిగి ఇప్పుడు ఆ పనులు ఊపందుకున్నాయి.  అయోధ్య ( Ayodhya ) లో రాామాలయం నిర్మాణానికి శంకుస్థాపన ( Bhoomi puja for Ram Temple ) చేయాల్సి ఉంది. అయితే సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ( Prime minister Narendra modi ) చేతుల మీదుగా భూమిపూజ చేయించాలనేది ట్రస్ట్ కమిటీ ( Trust Committee ) తో పాటు అయోధ్యలోని సాధువుల ఆలోచన. ఇందుకు తగ్గట్టే భూమిపూజకు రావల్సిందిగా ఆహ్వానాలు పంపించారు ప్రదాని మోదీకు. Also read: Kerala: సముద్రం ఆ ఊరిని ఎలా ముంచెత్తుతుందో..


దీనికి సంబంధించి ఇప్పుడు ట్రస్ట్ కమిటీ ప్రధాని కార్యాలయానికి రెండు తేదీల్ని పంపించారు. ఆగస్టు 3, ఆగస్టు 5 ( August 3rd and August 5th ) ముహూర్తపు తేదీల్ని సూచించారు. రెండు తేదీల్లో ఒకదానికి ఫైనల్ చేయమంటూ ప్రధానికి ఆహ్వానం పంపించామని ట్రస్ట్ సభ్యులు స్పష్టం చేశారు. 


ఈ రెండు తేదీల్లో ఆగస్టు 5 ముహూర్తానికి ప్రధాని కార్యాలయం ( PMO Office ) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 5 ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అయోధ్య చేరుకుంటారు.  పవిత్ర అయోధ్య నగరంలో ప్రధాని మోదీ దాదాపు 3న్నర గంటల సేపు ఉండవచ్చని తెలుస్తోంది. Also read: ఢిల్లీ భారీ వర్షాల ప్రభావం: కొట్టుకుపోయిన ఓ ఇల్లు


అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ ( Pm attend Bhoomi puja in Ayodhya ) అనంతరం హనుమాన్ టెంపుల్, సరయూ నదిని ప్రదాని మోదీ సందర్శించవచ్చు.  ప్రధాని మోదీ రామ జన్మభూమి ఆలయ పరిసరాల్లో దాదాపు గంటసేపు ఉండవచ్చు. భూమిపూజ అనంతరం అయోధ్య అభివృద్ధికి సంబంధించిన పలు  శంకుస్థాపన కార్యక్రమాలకు మోదీ హాజరుకానున్నారు. Also read: AP: సెప్టెంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభం?


2014లో దేశ ప్రదానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అయోధ్యను మోదీ సందర్శించనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. Also read: AP Capital: ఇక కొత్త రాజధానులు త్వరలో ప్రారంభం