Baba Vanga Predictions: బల్గేరియా నోస్ట్రడామస్‌గా గుర్తింపు పొందిన వాంగేలియా పాండెవా గుష్తెరోవా అలియాస్ బాబా వాంగా భవిష్యత్ జోస్యం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బాబా వాంగా 1996 లోనే చనిపోయినప్పటికీ.. భవిష్యత్ గురించి ఆమె చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని చెబుతారు. 2022తో పాటు భవిష్యత్‌కు సంబంధించి బాబా వాంగా చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పినట్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాబా వాంగా జోస్యం ఇదే : 


సైబీరియాలో మరో ప్రాణాంతక మహమ్మారి వైరస్ పుట్టుకురానుంది. క్లైమేట్ చేంజ్ పర్యావసానంగా ఈ కొత్త వైరస్ ప్రపంచంపై దాడి చేయనుంది.


మనుషులు ఎక్కువ సమయం వర్చువల్ వరల్డ్‌లోనే విహరిస్తారు. ఇంటర్నెట్, సెల్‌ఫోన్లలోనే మునిగితేలుతారు.


భూమిపై గ్రహాంతరావాసుల దండయాత్ర జరుగుతుంది. గ్రహాంతరవాసులు భూమి పైకి ఒక ఆస్టరాయిడ్‌ను పంపిస్తారు.


భారత్ లాంటి దేశాల్లో మిడతల దండయాత్ర జరుగుతుంది. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటుతాయి. 


ఆస్ట్రేలియాతో పాటు కొన్ని ఆసియా దేశాలు వరదలతో అతలాకుతలమవుతాయి. భూకంపాలు, సునామీ వంటివి సంభవించవచ్చు. ఇప్పటికే ఆస్ట్రేలియాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే.


2023లో భూమి కక్ష మారుతుంది. వ్యోమోగాములు శుక్ర గ్రహం పైకి ప్రయాణిస్తారు.


2046లో ప్రజలు వందేళ్ల కన్నా ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. అవయవ మార్పిడి టెక్నాలజీతో ఇది సాధ్యపడుతుంది.


2100లో అసలు రాత్రి పూట అనేదే లేకుండా పోతుంది. కృత్రిమ సూర్యుడి కారణంగా నిరంతరం వెలుతురు ఉంటుంది.


5079లో ఈ ప్రపంచం అంతమవుతుంది.


బాబా వాంగా జోస్యం ఎంతవరకు నిజం..?


బాబా వాంగా చెప్పినవాటిలో 85 శాతం జరిగినట్లు చెబుతారు. చెర్నోబిల్ ట్రాజెడీ, ప్రిన్సెస్ డయానా మరణం, సోవియెట్ యూనియన్ రద్దు, 2004 థాయిలాండ్ సునామీ, బరాక్ ఒబామా అధ్యక్షుడు కావడం వంటివి బాబా వాంగా ముందుగానే ఊహించి చెప్పిందంటారు.


ఎవరీ బాబా వాంగా :


బాబా వాంగా 1911లో బల్గేరియాలోని స్ట్రుమికాలో జన్మించింది. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండేది. చిన్నతనంలోనే కళ్లు కూడా కోల్పోయింది. బాబా వాంగాకు కొన్ని అతీంద్రీయ శక్తులు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఆ కారణంగానే ఆమె భవిష్యత్తును అంచనా వేసిందని చెబుతారు. నిజానికి బాబా వంగా చదువు అంతంతమాత్రమే. ఆమె తన జీవితకాలంలో ఏ పుస్తకం రాసింది లేదు. 1996లో ఆమె మరణించింది. ఆమె మరణం తర్వాత కూడా ఆమె పేరిట ప్రెడిక్షన్స్ వెలువడుతూనే ఉన్నాయి. 


Also Read: NEET 2022 Scam: నీట్ పరీక్ష రిగ్గింగ్ కలకలం, ఒక్కో సీటుకు 50 లక్షల వరకూ చెల్లింపులు


Also Read: Jharkhand SI Murder: జార్ఖండ్‌లో దారుణం.. మహిళా ఎస్సైని వాహనంతో ఢీకొట్టి చంపిన దుండగులు..



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook