బహిరంగ మల విసర్జన చేసేవారికి హెచ్చరిక
బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారికి హెచ్చరిక.
బహిరంగ మల విసర్జన చేసేవారికి హెచ్చరిక. ఎవరైనా బహిరంగ మల విసర్జన చేస్తే వారికి ఉరిశిక్ష విధిస్తామని ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్పట్ మున్సిపాలిటీ సంస్థ నగరవ్యాప్తంగా హోర్డింగులు ఏర్పాటు చేసింది. దీంతో స్థానికులు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోర్డింగులు, బ్యానర్లపై సర్వత్రావిమర్శలు చెలరేగడంతో అధికారులు వాటిని అక్కడి నుంచి తొలగించారు. హోర్డింగ్ డిజైనర్ చేసిన పొరపాటే దీనికి కారణమని, డిజైనర్‌ను విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
'స్వచ్ఛతా మిషన్‌లో భాగంగా బాగ్పట్ నగరవ్యాప్తంగా మొత్తం 45 హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో ఒక (ఢిల్లీ-యమునోత్రి హైవే) హోర్డింగ్‌లో 'బహిరంగ మల విసర్జన చేస్తే ఉరిశిక్ష' అని రాసి ఉంది. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్థానికులు, ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆ హోర్డింగ్‌ను అక్కడి నుంచి తొలగించాము. హోర్డింగ్ డిజైనర్ చేసిన పొరపాటే దీనికి కారణం' అని బాగ్పట్ పాలిక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లలిత్ ఆర్య అన్నారు.