Bank Holidays in December 2020 | కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా ప్రభావం మాత్రం ఉంది. దీంతో బయట తిరిగే వారు, బ్యాంకు పనులు, ఇతరత్రా ఆర్థిక లావాదేవీలు ప్లాన్ ప్రకారం చేసుకోవాలి. ప్రస్తుతం వర్షాలు, తుఫాన్ల కారణంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున చేతిలో అత్యవసర పనులుకు నగదు ఉంచుకోవాలి. డిసెంబర్ నెలలో మొత్తం 7 బ్యాంకు సెలవులు (Bank Holidays In December 2020) ఉన్నాయి. ఇవి తెలుసుకుని మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.



 


డిసెంబర్ నెలలో 4 ఆదివారాలు ఉన్నాయి. ఎస్‌బీఐ  బ్యాంకులతో పాటు ఇతరత్రా ప్రభుత్వ బ్యాంకులకు కూడా ఈ నాలుగు రోజులు సెలవు దినాలు. డిసెంబర్ 6, 13, 20 మరియు 27 ఆదివారాలు కనుక ఆ రోజులలో బ్యాంకులు సేవలు అందించవు. అదే విధంగా రెండు, నాలుగో శనివారాలలోనూ బ్యాంకు సిబ్బందికి సెలవు ఉంటుంది. డిసెంబర్ 13 మరియు డిసెంబర్ 26 తేదీలైన రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవు (SBI Bank Holidays in December). ఈ నెలలో క్రిస్మస్ పండుగ ఉంటుంది. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం.  



 


అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే బ్యాంకు సెలవులు ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు వర్తిస్తాయని తెలిసిందే. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in/ లో వివరాలు చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రతి రాష్ట్రంలోనూ సెలవు దినాలలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని తెలిసిందే.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook