Bank Locker Rules: బ్యాంకు లాకర్లలో ఈ వస్తువులు ఉంచడం నిషిద్ధం
Bank Locker Rules: బ్యాంకు లాకర్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు లాకర్ రూల్స్ మారుతుంటాయి. ఇప్పుడు మరోసారి బ్యాంకు లాకర్ నిబందనలు మారాయి. ఎస్బీఐతో సహా ఈ బ్యాంకు లాకర్లో కొన్ని వస్తువులు భద్రపర్చకూడదు. ఆ వివరాలు మీ కోసం
Bank Locker Rules: బ్యాంకు లాకర్ అనేది ప్రస్తుత రోజుల్లో బెస్ట్ ఆప్షన్. ఇంట్లో ఉండే విలువైన వస్తువుల్ని భద్రపర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. మీకు సంబంధించిన విలువైన వస్తువులు లేదా నగల్ని సురక్షితంగా భద్రపర్చుకునే వెసులుబాటు ఇది. అయితే లాకర్ నిబంధనలు కొన్ని మారాయి. దీని ప్రకారం ఏవి పడితేవాటిని లాకర్లలో ఉంచకూడదు.
బ్యాంకు లాకర్ అనేది మీ విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు భద్రపర్చుకునేందుకు మంచి మార్గం. కానీ కొన్ని రకాల వస్తవుల్ని లాకర్లలో ఉంచకూడదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, కెనరా బ్యాంకుల్లో వివిధ సైజుల్లో లాకర్లు ఇస్తుంటారు. మీ అవసరానికి తగ్టట్టుగా ఎలాంటి లాకర్ కావాలనేది నిర్ణయించుకోవాలి. అయితే లాకర్లలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదనేది చాలామందికి తెలియదు.
బ్యాంకు లాకర్లలో ఏవి భద్రపర్చవచ్చు
బంగారం, సిల్వర్, డైమండ్ వంటి నగలు లేదా కాయిన్స్, లేదా బిస్కట్స్, ఆస్థికి సంబంధించిన పత్రాలు, వీలునామా, దత్తత డాక్యుమెంట్లు, పవర్ ఆఫ్ అటార్నీ పేపర్లు ఉంచవచ్చు. ఇవి కాకుండా మ్యూచ్యువల్ ఫండ్స్, షేర్ కాగితాలు, ట్యాక్స్ రిసీప్టులు, ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లు ఉంచవచ్చు.
బ్యాంకు లాకర్లలో ఏవి నిషిద్దం
ఆయుధాలు, ఎక్స్‌ప్లోజివ్స్, డ్రగ్స్, అక్రమ వస్తువులు, ఆహార పదార్ధాలు, పాడయ్యే పదార్ధాలు, తుప్పు పట్టే వస్తువులు, రేడియా యాక్టివ్‌కు గురయ్యే వస్తువులు. కొన్ని బ్యాంకులయితే లాకర్లలో నగదు ఉంచడం సురక్షితం కాదంటున్నాయి. ఈ బ్యాంకులు లాకర్లలో నగదు ఉంచనివ్వవు.
బ్యాంకు లాకర్లలో ఉంచే వస్తువులకు మీదే బాధ్యత అవుతుంది. మీ అవసరానికి తగ్గ లాకర్ ఎంచుకోవాలి. లాకర్ వినియోగించేటప్పుడు బ్యాంకు నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవసరమైన కాగితాల్ని సురక్షితంగా క్రమ పద్ధతిలో భద్రపర్చుకోవాలి.
Also read: Election Results Live: మహారాష్ట్రలో రెండోసారి మహాయుతిదే అధికారం.. జార్ఖండ్‌లో ఉత్కంఠ
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.