India Economy position: ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఇండియా ఆవిర్భవించనుందా..అవుననే అంటోంది ఆ నివేదిక. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విడుదల చేసిన తాజా నివేదిక సారాంశమిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత దేశ ఆర్ధిక వ్యవస్థ 2031-32 అంటే మరో పదేళ్లకు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఆవిర్భవించనుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (Bank of America)సెక్యూరిటీస్ తాజా నివేదిక వెల్లడించింది. వాస్తవానికి 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికే భారత్‌ ఈ స్థాయిని అందుకోవల్సి ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి ప్రతికూలతలు భారత దేశ వృద్ధి వేగాన్ని అడ్డగించాయని వివరించింది. యువత అధికంగా ఉండడం, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో పరిపక్వత భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలని నివేదిక వివరించింది.


గత ఎనిమిదేళ్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమర్ధవంతమైన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వల్ని ప్రస్తుతం దాదాపు 550 బిలియన్‌ డాలర్లు నిర్వహిస్తోందని నివేదిక తెలిపింది. రూపాయి స్థిరత్వానికి, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణుల నుంచి భారత్‌ను రక్షించడానికి ఈ చర్య దోహదపడుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషించింది. ఇక భారత బ్యాంకింగ్‌ మొండి బకాయిల సమస్య పరిష్కారానికి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ఆలోచన మంచి ఫలితాల్ని అందిస్తుందని వివరించింది. తీవ్ర స్థాయిలో ఉన్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరమైన అంశంగా పేర్కొంది. 


2024-25 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్నది భారత్‌ లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం అమెరికా, చైనాలు  వరుసగా 16,10 ట్రిలియన్ డాలర్లు ఆర్ధిక వ్యవస్థ కలిగి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడవ స్థానంలో జపాన్ ఉండగా..నాలుగవ స్థానంలో జర్మనీ, ఐదవ స్థానంలో ఇండియా ఉన్నాయి. ప్రస్తుతం ఇండియా 2.65 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థను కలిగి ఉంది.


Also read: Oxford-AstraZeneca vaccine: మెరుగైన ఫలితాలనిస్తున్న ఆక్స్‌‌ఫర్డ్ వ్యాక్సిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook