Oxford-AstraZeneca vaccine: మెరుగైన ఫలితాలనిస్తున్న ఆక్స్‌‌ఫర్డ్ వ్యాక్సిన్

Oxford-AstraZeneca vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మార్కెట్లో ఫైజర్, మోడెర్నాలతో పాటు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పనితీరు బాగుందని తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2021, 03:12 PM IST
Oxford-AstraZeneca vaccine: మెరుగైన ఫలితాలనిస్తున్న ఆక్స్‌‌ఫర్డ్ వ్యాక్సిన్

Oxford-AstraZeneca vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. మార్కెట్లో ఫైజర్, మోడెర్నాలతో పాటు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పనితీరు బాగుందని తెలుస్తోంది.

ఫైజర్, మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌లతో పాటు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్(Oxford-AstraZeneca Vaccine)‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పనితీరు అద్భుతంగా ఉందనే వార్తలు వెలువడ్డాయి. వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అమెరికా, చిలీ, పెరూ దేశాల్లో దాదాపు 31 వేలమంది వాలంటీర్లపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో కోవిడ్ 19 ను అడ్జుకోవడంతో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 79 శాతం పనితీరును ప్రదర్శించిందని తెలిసింది. వ్యాధి ముదరకుండా చూడటం, ఆసుపత్రిపాలు కాకుండా చేయడంలో వ్యాక్సిన్ 100 శాతం ఫలితాల్ని సాధించినట్టు తేలింది. ఇదే వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ (Covishield) పేరుతో ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలకు ఎగుమతి అవుతోంది. ఇండియాలో కూడా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 

Also read: Nokdo Island: దక్షిణ కొరియాలోని నోక్డో ఐల్యాండ్‌లో చిన్నారులు ముగ్గురే ముగ్గురున్నారట..నమ్మలేకున్నారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News