బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున 5 సభ్యులతో కూడిన నిజ నిర్థారణ కమిటీ జమ్ము కాశ్మీర్‌లోని కథువా ప్రాంతాన్ని సందర్శించాలని భావిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 19వ తేదిన సుప్రీం కోర్టు నుండి కొంత సమయం అడగనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీఐ అధినేత మనన్ మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిజ నిర్థారణ కమిటీలో మాజీ బీసీఐ అధినేత తరుణ్ అగర్వాల్‌తో పాటు కో ఛైర్మన్ ఎస్ ప్రభాకరన్, రామచంద్ర జీ షా, ఉత్తరాఖండ్ బార్ కౌన్సిల్ సభ్యులు రజియా బేగ్, నరేష్ దీక్షిత్ కూడా పాలుపంచుకోనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కమిటీ కథువా ప్రాంతాన్ని సందర్శించి అక్కడి బాధిత కుటుంబంతో పాటు ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించనుంది. ఏప్రిల్ 20 తేదిన కమిటీ కథువా బయలుదేరనుంది. ఈ విషయాన్ని  ఇప్పటికే జమ్ముతో పాటు కథువా ప్రాంత బార్ అసోసియేషన్‌కు తెలియజేశామని బీసీఐ పేర్కొంది


ఈ మేరకు మనన్ మిశ్రా మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైనా న్యాయవాదులు ప్రవర్తిస్తే వారి లైసెన్సులను బార్ కౌన్సిల్ తొలిగిస్తుందని తెలిపారు. అయితే ఒకవేళ బయట వ్యక్తులెవరైనా ఈ కేసు విషయంపై వివాదం చేయాలని భావిస్తే మాత్రం.. అది బార్ కౌన్సిల్ పరిధిలో ఉండదని ఆయన అన్నారు.


ఒకవేళ న్యాయవాదులే కారకులైతే మాత్రం వారి రిజిస్ట్రేషన్లపై జీవితకాలం నిషేధం విధించడానికి కూడా తాము వెనుకాడమని ఆయన తెలిపారు. కమటీ ఒకసారి ఈ విషయంపై సమగ్ర ప్రణాళిక తయారుచేసి నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో కథువా ప్రాంతంలో ఓ 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే