మహారాష్ట్ర(Maharashtra)లో మూడు నెలల తర్వాత క్షౌరశాలలు(Barber Shops and Salons) తెరుచుకున్నాయి. ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వడంపై సెలూన్ షాపు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మూడు నెలలుగా తమ షాపులు మూతపడటంలో బతుకుదెరువుకు చాలా కష్టంగా మారిందని బార్బర్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. నటి డ్యాన్స్‌కు 24గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాసిక్‌లోనూ సెలూన్ షాపులు తెరుచుకోవడంతో కస్టమర్లు క్యూ కడుతున్నారు. దీనిపై సెలూన్ షాపు ఓనర్ స్పందించారు. ‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా దగ్గరికి వచ్చే కస్టమర్ కచ్చితంగా రావడానికి ముందే అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కటింగ్ చేయించుకోవడానికి అనుమతించం. ప్రతి పరికరాన్ని, వస్తువును వాడకముందు, తర్వాత శానిటైజ్ చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని’ వివరించారు. క్లాస్‌మేట్‌కు మత్తు మందిచ్చి బీటెక్ విద్యార్థుల అఘాయిత్యం


‘ప్రతి రెండు గంటలకు సెలూన్ షాపు మొత్తం శానిటైజ్ చేస్తున్నాం. అనుమతి ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు పాటిస్తామని’ ముంబైలోని ఓ సెలూన్ షాపు ఓనర్ చెప్పారు. కాగా, ముంబైలో నిన్నటివరకు 27,134 కరోనా యాక్టీవ్ కేసులున్నట్లు సమాచారం. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ