నటి డ్యాన్స్‌కు 24గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్

ప్రస్తుతం డ్యాన్స్ స్టెప్ ఛాలెంజ్ ధొరణి ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఛాలెంజ్‌పై టిక్‌టాక్ స్టార్లే కాకుండా.. ఇప్పుడు గ్లోబల్ స్టార్లు కూడా టిక్‌టాక్‌లో తమ నైపుణ్యాలను చూపిస్తూ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నోరా ఫతేహి చేసిన సాకిసాకి పాట హుక్ స్టెప్ ఛాలెంజ్ (Nora Fatehi saki saki hook step Video) ట్రెండింగ్‌గా మారింది.

Updated: Jun 28, 2020, 12:39 PM IST
నటి డ్యాన్స్‌కు 24గంటల్లోనే 40 మిలియన్ల వ్యూస్
Image: VideoGrab

బాలీవుడ్‌లో అల్టిమేట్‌గా ఎవరు డ్యాన్స్ చేస్తారు.. అని అడిగితే ఎవరైనా వెంటనే నోరా ఫతేహి (Nora Fatehi) అని చెబుతారు. నోరా డ్యాన్సర్‌గా, మోడల్‌గా, సింగర్‌గా,‌ నటిగా ఇప్పటికే పేరును సంపాదించింది. ఆమె రిలీజ్ చేసిన వీడియోలు క్షణాల్లోనే ట్రెండింగా మారతాయి. అందుకే సోషల్ మీడియాను ప్రభావితం చేసే సినీ సెలబ్రిటీలలో టాప్ 10లో ఉంది నోరా. అయితే ఇప్పుడు ఆ భామ టిక్‌టాక్‌ (TikTok) లో కూడా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో నోరా టిక్‌టాక్‌లో ‘సాకి సాకి’పాట హుక్ స్టెప్‌ (saki saki hook step) వీడియోను అభిమానులకు ఛాలెంజ్ చేస్తూ పోస్ట్ చేసింది.  ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా..

ఈ వీడియో కేవలం ఆరు గంటల్లోనే 20మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా 24గంటల్లో ఈ వీడియోను 4కోట్లపైగా యూజర్లు చూశారంటే.. ఆమెకున్న క్రేజ్‌ను మనం ఊహించవచ్చు. 2019లో వచ్చిన బాట్లా హౌస్ (Batla Hous) సినిమాలోని సాకి సాకి పాటతో నోరా అభిమానులను పిచ్చిక్కించింది. ఇప్పటికీ ఆ పాటకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆ చిత్రంలో నోరా చిన్న పాత్ర చేసినప్పటికీ ఎన్నో ప్రశంసలను అందుకుంది. RGV మరో సంచలనం.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘పవర్ స్టార్’

@itsnoriana

So I noticed The ##osakisaki step challenge is back on! Lets do this guys give me moves & expressions! Lets go🔥💃🏾 ##norafatehi ##trending

♬ original sound - awezdarbar

అయితే ఇప్పుడు నోరా అప్‌కమింగ్ మూవీ 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' (Bhuj: The Pride of India) లో అజయ్ దేవ్‌గన్‌ సరసన నటిస్తోంది. ఆ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 24 గంటల్లో 40 మిలియన్ల వ్యూస్ వచ్చిన ఈ వీడియో.. ప్రస్తుతం 50 మిలియన్లు దాటి పరుగులు పెడుతోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ