BEL Recruitment 2022: కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 3, 2022 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు :


ట్రైనీ ఇంజనీర్


ఈసీఈ-54
మెకానికల్-20
ఈఈఈ-04
సీఎస్-02


ప్రాజెక్ట్ ఇంజనీర్


ఈసీఈ-54
మెకానికల్-20
ఈఈఈ-04
సీఎస్-02


విద్యార్హతలు :


ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఏదేని ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో నాలుగేళ్ల బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.


వయోపరిమితి :


అభ్యర్థుల కనీస వయసు 28 ఏళ్లు, గరిష్ఠ వయసు 32 ఏళ్లు.


ఎలా దరఖాస్తు చేసుకోవాలి :


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్ హోంపేజీలో కెరీర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కనిపిస్తుంది.
అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యక్తిగత ఐడీతో లాగిన్ అయి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.
ఆగస్టు 3, 2022తో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.

 


Also Read: JLM Exam: జూనియర్ లైన్‌మెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్... పలువురు అభ్యర్థుల అరెస్ట్..  


Also Read: India Presidents:ద్రౌపది ముర్ముకు 64 శాతం ఓట్లు... ఎక్కువ ఓట్లతో రాష్ట్రపతిగా గెలిచిందో ఎవరో తెలుసా? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 



 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook