Mamata Banerjee: ఛాన్సలర్‌గా సీఎం మమత..బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
Mamata Banerjee: బెంగాల్‌లో గవర్నర్ జగదీప్ ధన్‌కడ్, సీఎం మమతా బెనర్జీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. యూనివర్సిటీ నియామకాలపై మాటల యుద్దం కొనసాగుతోంది. ఈక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Mamata Banerjee: బెంగాల్‌లో గవర్నర్ జగదీప్ ధన్‌కడ్, సీఎం మమతా బెనర్జీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. యూనివర్సిటీ నియామకాలపై మాటల యుద్దం కొనసాగుతోంది. ఈక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు సీఎం మమతా బెనర్జీ..ఛాన్సలర్‌గా ఉంటారని స్పష్టం చేసింది. ఈమేరకు అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశ పెట్టాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
ఈవిషయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బర్త్య బస్సు తెలిపారు. యూనివర్సిటీల్లో నియామకాలపై గవర్నర్ జగదీప్ ధన్‌కడ్, సీఎం మమతా బెనర్జీ మధ్య పలుమార్లు విభేదాలు వచ్చాయి. బహిరంగగానే విమర్శలు సంధించుకున్నారు. రాజ్‌భవన్‌తో సంబంధం లేకుండా మమత ప్రభుత్వం ..వీసీలను నియమిస్తోందని గవర్నర్ ఆరోపించారు. దీనిపై రాజకీయ దుమారం రేగింది.
ఈక్రమంలోనే గవర్నర్ జగదీప్ ధన్‌కడ్‌ను ఛాన్సలర్ హోదా నుంచి మమత తప్పించారు. గతంలో తమిళనాడు ప్రభుత్వం సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. నిబంధనలు ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్ వ్యవహరిస్తారు. ఐతే బెంగాల్ సీఎం మమత తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆమె..బీజేపీపై పోరాటం కొనసాగిస్తున్నారు.
ఈనేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ జగదీప్ ధన్‌కడ్ ఏవిధంగా ముందుకు వెళ్తారన్న చర్చ జరుగుతోంది. త్వరలో ఆయన ప్రెస్‌మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
Also read:Bridegroom Funny Video: వరుడి ప్యాంటు ఊడిపోయింది.. వధువు నవ్వు ఆపుకోలేకపోయింది!
Also read:CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్ టూర్ సక్సెస్..రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి