Mamata letter to oppositions: మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!
Mamata letter to oppositions: దేశ రాజకీయాలు చక చక మారుతున్నాయి. తెలంగాణ నుంచి జాతీయ పార్టీ ఏర్పాటు కాబోతోందని ఇప్పటికే జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Mamata letter to oppositions: జాతీయ రాజకీయాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోరు పెంచారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల దాడి పెంచారు. తాజాగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా అన్ని విపక్ష పార్టీల అధ్యక్షులు, సీఎంలకు ఆమె లేఖ పంపారు. దేశవ్యాప్తంగా 22 మంది ప్రతిపక్ష నేతలు, బీజేపీ, కాంగ్రెస్ యేతర ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రగతి శీల శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఈనెల 15న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు మమతా బెనర్జీ. దేశానికి సమర్థవంతమైన ప్రతిపక్షం కావాలన్నారు. దేశంలో పీడిస్తున్న విభజన శక్తులను ప్రతిఘటించాలని చెప్పారు. ప్రతిపక్ష నేతలను కేంద్రంలో ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని..దర్యాప్తు సంస్థల ద్వారా ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తోందని లేఖలో ఆరోపించారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను బీజేపీ ప్రభుత్వం కించపరిచిందని విమర్శించారు.
దేశంలో అంతర్గతంగా తీవ్ర విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు మమతా బెనర్జీ. ఈ సమయంలో మనమంతా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా విపక్ష నేతలంతా ఏకం కావాలన్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించుకోవాలని తెలిపారు. దేశంలో ఎన్నికలు స్మారక చిహ్నమని..ఇవి అత్యంత పారదర్శకంగా జరగాలన్నారు.
Also read: Joe Biden on Zelenskyy: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా సైనిక చర్య..యుద్ధంపై బైడెన్ ఏమన్నారంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి