CV Ananda Bose To Learn Bengali: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు ఈ నెల 26న అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వయసులో అక్షర్యాభ్యాసం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును ఇది నిజం. రాజ్‌భవన్‌లోని 'ఈస్ట్‌ లాన్‌'లో ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆయన పలక, బలపం పట్టి అక్షరాలు దిద్దనున్నారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఏఎస్‌గా రిటైర్ అయిన సీవీ ఆనంద్ బోస్‌.. తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఇప్పటికే ఇంగ్లిష్, హిందీ, మలయాళం భాషల్లో మంచి పట్టు ఉంది. ఈ భాషల్లో ఇప్పటికే 40 పుస్తకాలు రాశారు. బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బెంగాలీ భాష పట్ల తనకున్న ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. క్రిస్మస్‌పై బెంగాలీ పుస్తకం రాయాలనే కోరిక ఆయన మదిలో ఉండిపోయింది. ఇందుకోసం బెంగాలీ భాష నేర్చుకోవాలని సంకల్పించారు. 


 




నిఖిల్ భారత్ బంగా సాహిత్య సమ్మేళనం శతాబ్ది ఉత్సవాల్లో గవర్నర్ మాట్లాడారు. 'ఈ బెంగాల్ బంగారు బెంగాల్. ఇక్కడ కళ, సాహిత్యం, సంస్కృతిని అభ్యసిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కాబూలీవాలా కథ చదివాను. మినీ అనే చిన్నారి పాత్ర నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నేను బెంగాలీలో ఓ పుస్తకం రాస్తాను. బెంగాల్‌లోని ఈ సాహిత్యం, సంస్కృతి నాకు చాలా కాలంగా సుపరిచితం. ఈ బెంగాలీ నన్ను చాలా పనులు చేయడానికి ప్రేరేపించింది. నేను బెంగాల్ దత్తపుత్రుడిని. ఈ రోజు బెంగాల్ ఏమనుకుంటుందో దేశం మొత్తం ఆలోచిస్తోంది. రానున్న రోజుల్లో ఈ బెంగాల్ భారతదేశానికి మార్గదర్శకంగా నిలుస్తుంది..' అని అన్నారు. తాను మలయాళీ అయినప్పటికీ మనసులో బెంగాలీ మాత్రం అని చెప్పారు. గవర్నర్ పదవి వచ్చిన తర్వాత బెంగాలీ నేర్చుకుంటున్నట్లు చెప్పారు.  


తెలుగులో అక్షరాభ్యాసం మాదిరి.. బెంగాలీ భాషలోని అక్షరాలను నేర్చుకునే ముందు చిన్నారులకు 'హతే ఖోరీ' పేరుతో సంప్రదాయ రీతిలో ప్రత్యేక కార్యక్రమం జరుపుతారు. గవర్నర్ ఆనంద బోస్ కూడా సంప్రదాయ పద్ధతిలో హతే ఖోరీ (అక్షరాభ్యాసం) కార్యక్రమం అనంతరం తర్వాత బెంగాలీ భాషను నేర్చుకుంటారు. ఆయనకు బెంగాలీ మాట్లాడటం వచ్చు.. కానీ రాసేందుకు రాదు. ఈ నెల 26న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో అక్షరాలు దిద్దనున్నారు. 


Also Read: China Dam: సరిహద్దులో చైనా మాస్టర్ ప్లాన్.. సీక్రెట్‌గా ఆనకట్ట నిర్మాణం  


Also Read: Kadapa Road Accident: ఆగి ఉన్న లారీ ఢీకొన్న టెంపో.. ముగ్గురు మహిళలు మృతి, 8 మందికి తీవ్రగాయాలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook