Bengaluru Men Hire Goons To Kill Senior Employee: సాధారణంగా పని ప్రదేశంలో కొందరు సైకోలుగా ఉంటారు. ప్రతివిషయంలోను తోటీ ఉద్యోగులను వేధిస్తుంటారు. చిటికీ మాటికి పనిగట్టుకుని  చిరాకు తెప్పిస్తుంటారు. ఎంత క్రియేటివ్ గా వర్క్ చేసిన కూడా గుర్తించరు. అంతేకాకుండా తమకు ఎక్కడ పోటీగా వస్తారో అని, తమ నక్క జిత్తులను ప్రదర్శిస్తుంటారు. పైన చూడడానికి ప్రేమగా, వినయంగా మాట్లాడుతూ.. లోపల మాత్రం ఎప్పుడూ చూసిన కన్నింగ్ ఆలోచనలతో ఉంటారు. బాస్ ముందు మంచిగా ఉన్నట్లు నటిస్తూనే, ఉద్యోగుల వెనుక వైపు గోతులు తవ్వుతుంటారు. మరికొన్ని చోట్ల మహిళలు పని ప్రదేశాలలో లైంగిక వేధింలను ఎదుర్కొంటారు. క్విడ్ ప్రో కో అన్న విధంగా.. తమకు లొంగకపోతే.. వర్క్ విషయంలో వేధింపులకు గురిచేస్తామంటూ, ఇండైరెక్ట్ గా సూచిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఎంతో సున్నితంగా ఉంటారు. వర్క్ ప్రెషర్ ను అస్సలు తట్టుకోలేరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇలాంటివారిని వేధింపులు గురిచేస్తే సూసైడ్ లు చేసుకొవడానికి సైతం వెనుకాడరు. కానీ మరికొందరు మాత్రం.. సీనియర్ ఎంప్లాయ్ లో షాడిస్టు వేశాలను చూస్తు ఉండకుండా.. సమయం వచ్చినప్పుడు తప్పకుండా లైఫ్ లో మర్చిపోలేని విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఇక్కడ కూడా ఇద్దరు ఉద్యోగులు సీనియర్ సహాచరుడి వేధింపులు భరించలేక ఎలాగైన అతనికి బుధ్ది చెప్పాలనుకున్నారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. బెంగళూరుకు చెందిన ఉమాశంకర్ ,  వినేష్ అనే ఇద్దరు యువకులు..తూర్పు బెంగళూరులోని హెరిటేజ్ మిల్క్ ప్రొడక్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడ కొంత కాలంగా పనిచేస్తున్నారు. వీరు చేసేది మార్కెటింగ్. అసలే మార్కెటింగ్ లో పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది చాలదన్నట్లు.. అక్కడ ఉండే సీనియర్ ఆడిటర్ సురేష్ వీరిని ప్రతి విషయంలో వేధిస్తుండే వాడు. కొంత కాలం సైలెంట్ గా భరించారు. కానీ అతగాడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఎలాగైన బుధ్ది చెప్పాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఒక సుపారీ బ్యాచ్ తో మాట్లాడారు.


మార్చి 31న ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కల్యాణ్‌ నగర్‌ సమీపంలో సురేష్‌ ఇంటికి వెళ్లేటప్పుడు రోడ్డు మీద అడ్డగించారు. అందరు చూస్తుండగానే  రోడ్డుమీద రాడ్ తో ఇష్టమున్నట్లు దాడిచేశారు. దీంతో అతను రోడ్డుమీద గాయాలతో పడిపోయాడు. ఘటన జరిగేటప్పుడు చుట్టుపక్కల వారు ఎవరు కూడా అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేదు. దుండగులు వెళ్లిపోయక మాత్రం.. అక్కడున్న వారు బాధితుడికి ఆస్పత్రికి తరలించారు . కొందరు ఈ ఘటనను వీడియో రికార్డు తీశారు.


Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..


ఈ ఘటన వైరల్ కావడంతో హెన్నూరు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడు ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా పెనుసంచలనంగా మారింది.ఈ ఘటనలో ఇప్పటి దాక.. ఐదుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో .. పని ప్రదేశంలో టార్చర్ పెట్డడం వల్ల ఇలా చేసినట్లు నిందితులు అంగీకరీంచారు.ఈ ఘటన మాత్రం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook