Bharat Biotech: కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతూనే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ భారతదేశపు మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ (Covaxin) కు సంబంధించి కీలక విషయాన్ని శుక్రవారం వెల్లడించింది.
Covaxin: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతూనే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ భారతదేశపు మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ ( Covaxin ) కు సంబంధించి కీలక విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. తాము అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్ మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ నెల 15న దేశంలోని 12 ప్రాంతాల్లో మొత్తం 375 మందిపై క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. Also read: Gold masks, silver masks: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులకు పెరిగిన డిమాండ్.. ధర ఎంతో తెలుసా ?
India's First Indigenous COVID 19 Vaccine, COVAXIN™, initiated Phase-1 clinical trials across the country on 15th July 2020.
.
.#BharatBiotech #COVAXIN #COVID19 #VaccineTrials #ClinicalTrials #Phase1 #Vaccine #Indiafightscorona #Makeinindia #Covid19pandemic #Innovation #science pic.twitter.com/wVQct4Z0CI
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సహకారంతో భారత్ బయోటెక్ కంపెనీ కరోనా వైరస్ నివారణకు కోవ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. అయితే కోవ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి (DCGI) ఇప్పటికే అనుమతిచ్చింది.
ఇదిలాఉంటే.. భారతదేశంలో కరోనావైరస్ కట్టడికి తయారవుతున్న కోవ్యాక్సిన్‌పై ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కేసులు కోటి 40 లక్షలు దాటాయి. మరణాల సంఖ్య కూడా ఆరు లక్షలకు చేరువలో ఉంది. Also read: Covid19: దేశంలో అత్యంత ప్రమాదకర జిల్లాలివే