Bhole Baba Hathras Stampede: దేశ చరిత్రలోనే అత్యంత విషాద సంఘటన మంగళవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది అమాయక ప్రజలు బలయ్యారు. దేశవ్యాప్తంగా ఈ విషాద సంఘటనపై చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేపట్టాయి. అయితే వందల కుటుంబాల్లో విషాదానికి కారణమైన భోలే బాబా తొలిసారి స్పందించారు. ఈ సంఘటనపై సంచలన ప్రకటన చేశారు. 'ఘటనలో అరాచక శక్తుల ప్రమేయం ఉంది' అని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Hatras stampede: హత్రాస్ ఘోరం.. ఎవరీ భోలే బాబా..?.. ఆ మట్టికి అంత క్రేజ్ ఎందుకు..?


ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లా పుల్‌రయీ గ్రామంలో మంగళవారం భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా  నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ భోలే బాబాను దైవంగా భావిస్తుండడంతో సత్సంగ్‌కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సత్సంగ్‌ కార్యక్రమం ముగిసి తిరిగి వెళ్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 121 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆస్పత్రులు శవాలతో నిండిపోయాయి.. సామూహిక అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ సంఘటనతో దేశమంతా దిగ్భ్రాంతికి గురయ్యింది. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ జరుగుతోంది.

Also Read: Stampede Uttar Pradesh: శవాల దిబ్బగా మారిన ఆలయం.. యోగి తీవ్ర దిగ్భ్రాంతి.. షాకింగ్ వీడియో వైరల్..


ఈ విషాద సంఘటనపై భోలే బాబా స్పందించారు. 'నేను వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాత తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నా. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేసిన అధికారులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. భోలే బాబా వెళ్తున్న సమయంలో ఆయన పాదాల వద్ద మట్టి కోసం ప్రయత్నించడంతోనే ఈ సంఘటన జరిగిందని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి