Stampede Uttar Pradesh: శవాల దిబ్బగా మారిన ఆలయం.. యోగి తీవ్ర దిగ్భ్రాంతి.. షాకింగ్ వీడియో వైరల్..

Uttar Pradesh Hathras: ఉత్తర ప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.  హత్రాస్‌ రతీభాన్‌పూర్‌లో మంగళవారం ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో..27 మంది సంఘటన స్థలంలోనే విగత జీవులుగా మారిపోయారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 2, 2024, 05:41 PM IST
  • ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘోరం..
  • 27 మంది దుర్మరణం
Stampede Uttar Pradesh: శవాల దిబ్బగా మారిన ఆలయం.. యోగి తీవ్ర దిగ్భ్రాంతి.. షాకింగ్ వీడియో వైరల్..

27 include 3 childrens killed in stampede at religious event in uttar Pradesh:  కొన్నిసార్లు జనాలు ఒకే ప్రదేశానికి భారీగా వెళ్తుంటారు. దీని వల్ల అనుకొని ఘటనలు జరుగుతుంటాయి.  కుంభమేళాలు, పుష్కరాలు, యాత్రలలో మనం తరచుగా వేలాది మంది వెళ్లడం చూస్తుంటాం. కానీ ఈ క్రమంలో కొన్నిసార్లు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. ఇప్పటికే పలుమార్లు దేవాలయాల దర్శనం కోసం వెళ్లినప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఈ క్రమంలో ప్రాణాలు సైతం పోయిన ఘటనలు కొకొల్లలు. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

 

పూర్తి వివరాలు..

ఉత్తరప్రదేశ్‌‌లో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. హత్రాస్‌ జిల్లా రతీభాన్‌పూర్‌లో మంగళవారం తొక్కిసలాట జరిగింది. అక్కడి భోలా బాబా ఆలయంకు వందలాదిగా భక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో.. 27 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. దీనిలో  చిన్నారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరగ్గానే గాయపడిన వారిని స్థానికులు,  ఎటాహ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, విపత్తు అధికారులు రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరా తీశారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

ఇదిలా ఉండగా.. రతీభాన్‌పూర్‌లో  భోలే బాబా సత్సంగ్ పరమశివుడి ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఆ సమయంలో భక్తులంతా ఒక్కసారిగా స్వామిని దర్శనం చేసుకునేందుకు ఎగబడ్డ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భక్తులు ఆలయసిబ్బందిపై మండిపడుతున్నారు.

Read more: Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..

భక్తులకు వందలాదిగా వస్తున్న సరైన సదుపాయాలు కల్పించలేదని విమర్శిస్తున్నారు. భక్తులను కంట్రోల్ చేయడంలో సిబ్బంది పూర్తిగా ఫెయిల్ అయ్యారనిఆరోపిస్తున్నారు. దీని వల్లనే ఇంతటి ఘోరం జరిగిందని తమ వాళ్లను పొగొట్టుకున్న వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News