Karnataka: కర్నాటక ముఖ్యమంతి బీఎస్ యడియూరప్పకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరట కల్పించింది. అవినీతి ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తును నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(Yediyurappa) ఆశ్రయించారు. తదుపరి ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై సుదీర్ఘకాలం విచారణ సాగింది. అనంతరం కేసు దర్యాప్తు మరింత ముమ్మరంగా చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. అటు యడియూరప్పపై లోకాయుక్త నమోదు చేసిన కేసు విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని కర్ణాటక హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసి ఉంది. హైకోర్టు తీర్పును యడియూరప్ప సుప్రీంకోర్టు ( Supreme court) లో సవాలు చేశారు. మార్చ్ 21న పిటీషన్ దాఖలు చేశారు. హైకోర్టు (High Court) ఆదేశాలపై స్టే కోరారు. 


ఈ పిటీషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. యడియూరప్ప తరపున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు విన్పించారు. 24 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు బదలాయించడం సక్రమమేనంటూ వాదించారు. ఇరువర్గాల వాదన విన్న సుప్రీంకోర్టు..హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ముఖ్యమంత్రి యడియూరప్పకు ఊరట కల్పించింది. 


Also read: Tamilnadu Assembly Elections: తమిళనాట ముగిసిన ప్రచారం, 234 నియోజకవర్గాలకు రేపే పోలింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook