MLAS JUMP: ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు జంప్.. నితీశ్ కుమార్ కు బీజేపీ షాక్
MLAS JUMP: ఎన్డీఏ కూమిటి నుంచి ఇటీవలే బయటికి వచ్చింది జనతాదళ్ యునైటెడ్ పార్టీ. బీహార్ లో బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. తమకు గుడ్ బై చెప్పిన నితీశ్ కుమార్ కు కొన్ని రోజుల్లోనే దిమ్మతిరిగే షాకిచ్చింది కమల దళం.
MLAS JUMP: ఎన్డీఏ కూమిటి నుంచి ఇటీవలే బయటికి వచ్చింది జనతాదళ్ యునైటెడ్ పార్టీ. బీహార్ లో బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. బీజేపీకి రాంరాం చెప్పి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్.. తర్వాత ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు కుప్పకూలుతుండగా.. బీహార్ లో మాత్రం బీజేపీకి ఝలక్ తగిలింది. బీహార్ రాష్ట్ర పరిణామాలతో గుర్రుగా ఉన్న బీజేపీ.. నితీశ్ కుమార్ ను టార్గెట్ చేసిందనే వార్తలు వచ్చాయి. ప్రచారం సాగుతున్నట్లుగానే పరిణామాలు జరుగుతున్నాయి. తమకు గుడ్ బై చెప్పిన నితీశ్ కుమార్ కు కొన్ని రోజుల్లోనే దిమ్మతిరిగే షాకిచ్చింది కమల దళం.
ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యారు. అయితే ఇది జరిగింది మాత్రం బీహార్ లో కాదు మణిపూర్ లో. ఆ రాష్ట్రంలో బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలో ఉంది. బీహార్ పరిణామాలతో మణిపూర్ లోనూ జేడీయూ బీజేపీ కూటమి నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది బీజేపీ. మణిపూర్ లో జేడీయూకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా..అందులో ఐదుగురు జేడీయూకి రాజీనామా చేశారు. బీజేపీ గూటికి చేరారు. అంతేకాదు మూడింట రెండింతల మధ్య బయటికి రావడంతో తమను బీజేఎల్పీలో కలపాలని స్పీకర్ కు లేఖ ఇచ్చారు. దీంతో జేడీయూ ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ ఓకే చెప్పారు.
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2022 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాల్లో గెలవగా.. ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ ఐదు, నేషనల్ పీపుల్స్ పార్టీ 7 సీట్లు గెలిచింజది. 38 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జేడీయూ ఏడు సీట్లు గెలుచుకుంది. ఏడుగురిలో ఐదుగురు బీజేపీలోకి జంప్ కావడంతో మణిపూర్ లో జేడియూ అడ్రస్ గల్లతైంది. మరోవైపు అసెంబ్లీలో బీజేపీ బలం 32 నుంచి 37కు పెరిగింది. జేడీయూ ఎమ్మెల్యేల జంప్ మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. బీజేపీ తీరుపై జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైరయ్యారు.ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీజేపీ కోట్లాది రూపాయలతో కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
Also Read : KCR VS NTR: మెగా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్.. ఎన్టీఆర్ కు బ్రేక్! కేసీఆర్ సర్కార్ ఎందుకిలా..?
Also Read: బ్రహ్మాస్త్రం ఈవెంట్ పర్మిషన్ క్యాన్సిల్ వలన ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి