Bihar And Karnataka CM's Nitish Kumar, Basavaraj Bommai tests positive for Covid-19 : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో (Home Isolation‌) ఉన్నారు. ఈ మేరకు బిహార్ సీఎంఓ (Bihar CMO) నుంచి ప్రకటన వెలువడింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని బిహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ (Bihar CM Nitish Kumar) తెలిపారు. అలాగే కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై (Karnataka CM Basavaraj Bommai ) కూడా కోవిడ్ బారినపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే చాలా మంది  ప్రముఖులు కోవిడ్ బారినపడ్డారు. తాజాగా బిహార్, కర్ణాలటక సీఎంలకు కోవిడ్ పాజిటివ్‌గా (Bihar CM Nitish Kumar tests positive) నిర్ధారణ కాగా.. ఇటీవల బిహార్ క్యాబినెట్‌లో (Bihar Cabinet) నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే బిహార్ సీఎం నితీశ్‌ కుమార్ (Bihar CM Nitish) ఇంట్లోని సిబ్బందిలో కూడా చాలా మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా (Covid‌ Positive) నిర్ధారణ అయింది. కొన్ని రోజుల క్రితం  నితీశ్‌ కుమార్ ఇంట్లోని 40 మంది సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వారం రోజులుగా బిహార్‌‌లో కోవిడ్‌ కేసుల (Bihar Covid cases) తీవ్రత పెరిగింది. 


కోవిడ్ కేసులు పెరగడంతో ఇటీవలే సీఎం నితీశ్‌ను (CM Nitish) మరో ఇంటికి షిఫ్ట్ చెయ్యాలని వైద్య సిబ్బంది సూచించారు. ఆ మేరకు పాట్నాలోని మరో ప్రదేశంలో సీఎం నితీశ్‌ బస కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.



 


Also Read : Telangana Weather Report: తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు- వాతావరణ కేంద్రం హెచ్చరిక


ఇక గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1.79 ల‌క్ష‌ల మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ పాజిటివిటీ రేటు (Covid positivity rate) 13.29 శాతంగా ఉంది. గత పది రోజుల్లోనే కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పది రోజుల క్రితం భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 10 వేల నుంచి 15 వేలు ఉండగా.. నిన్న ఒక్కరోజే లక్షా 79వేల కోవిడ్ పాజిటివ్‌ కేసులు (Covid positive‌ cases) వెలుగులోకి వచ్చాయి. ముంబై, ఢిల్లీలాంటి ప్రాంతాల్లో రోజూ 20 వేల కోవిడ్‌ (Covid‌) పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు (Omicron cases) కూడా నాలుగు వేలు దాటాయి.


Also Read : Ap Corona cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 984 కరోనా కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook