Gutha Amit Reddy: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆపరేషన్ కాంగ్రెస్‌లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లాలో పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్ రెడ్డిని సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు పార్టీలో చేర్పించారు.
Also Read: DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్ కట్.. ఉద్యోగి పోస్టు ఊస్ట్
హైదరాబాద్‌లో సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు అమిత్ రెడ్డిని వెంట తీసుకొచ్చారు. అమిత్ తన భార్యతో కలిసి దీపాదాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా కొంతసేపు మాట్లాడారు. అమిత్ రాకతో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంత జోష్ రానుంది.
Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్ ప్రకటన
అమిత్ ఎవరు?
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి. బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్న వీరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో రాజకీయ ప్రత్యామ్నాయం చూస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పని చేశారు. నల్లగొండ నుంచి ఎంపీగా సుఖేందర్ రెడ్డి గెలుపొందారు. గతంలో ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, సీనియర్ నాయకుడు జానారెడ్డితో కలిసి పని చేశారు. అయితే కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గులాబీ పార్టీ సుఖేందర్ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చింది. నల్లగొండ జిల్లాలో సుఖేందర్ పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో సుఖేందర్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.
సీటు ఇవ్వకపోవడమే?
లోక్‌సభ ఎన్నికల్లో అమిత్ రెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ పట్టించుకోకుండా కంచర్ల కృష్ణారెడ్డికి అవకాశం ఇవ్వడంతో సుఖేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ఆయన బహిరంగ విమర్శలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ ఎన్నికల్లో ఓటమికి కారణాలు వివరిస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీలో కలవరం మొదలైంది. అయితే సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం పెట్టుకున్న అనంతరమే విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో బేరసారాలు జరిగిన తర్వాతనే కేసీఆర్‌పై సుఖేందర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని చెప్పారు. ఈ క్రమంలోనే అమిత్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. త్వరలోనే సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Gutha Amith Reddy: బీఆర్‌ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్ రెడ్డి