ketu guru gochar 2024: కేతు, గురు గోచారం.. ఈ మూడు రాశులకు గొప్ప అదృష్టం.. మీరున్నారా..?

ketu guru gochar 2024:  సాధారణంగా కేతువును పాప గ్రహాంగా భావిస్తారు. కానీ పాప గ్రహామైన కేతు, దేవగురువైన గురుడితో కలవడం వల్ల జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయి. దీంతో వీరి దశ అనేది ఊహించని విధంగా మారిపోతుంది. 

1 /6

సాధారణంగా కొన్ని గోచారాలు, యోగాల వల్ల వ్యక్తి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. దీన్ని బట్టి ఆ వ్యక్తి  అప్పటి వరకు ఉన్న స్థానం నుంచి గొప్ప స్థానానికి ఎదుగుతాడు. దీని వల్ల మంచి కాలం కలిసి వస్తుంది. ఇలాంటిసమయంలో ఏ పనులు తలపెట్టిన కూడా విజయాలను సాధిస్తారు. అందుకే ఈ కేతు గురు గోచారం మంచిదని పండితులు చెబుతుంటారు.  

2 /6

గురువు అనుకూలిస్తే ఎంతటి పనులైన ఈజీగా జరిగిపోతుంటాయి. అందుకే పెళ్లి చేయాల్సి వచ్చిన, ఇల్లుకొనాలన్న, ఉద్యోగంలో మార్పు పొందాలన్న కూడా గురు గ్రహాం ఎంతో గొప్పగా పనిచేస్తుంది. దీని వల్ల అనేక మంచి ఫలితాలు కల్గుతాయి.కేతువు, గురువు కలవడం వల్ల కొన్ని రాశులు వారికి జాతకం లో మార్పులుసంభవించనున్నాయి.   

3 /6

వృషభరాశి: ఈరాశిలో గురుకేతువులు యోగించడం వల్ల ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా..  పనిలో మంచి నిపుణత సాధిస్తారు. వీరికి ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలన్ని దూరమైపోతాయి. మంచి  పెళ్లి సంబంధంకుదురుతుంది. అన్నింటిలో కూడా రాణిస్తారు.

4 /6

కర్కాటక రాశి: కర్కాటక రాశిలోని వారికి కూడా ఈ యోగం వల్ల కలలో కూడా ఊహించని విధంగా ధనలాభం సంభవిస్తుంది. మీరు ఇన్నాళ్లుగా వేచిన కలసాకారం అవుతుంది. అఖండ ధనయోగం మీకు సొంత మవుతుంది. అంతేకాకుండా.. మీ తండ్రుల ఆస్తి మీకు దక్కుతుంది.  

5 /6

కన్య రాశి: రియల్ ఎస్టెట్ రంగంలో పనిచేసేవారికి గొప్ప సమయం అని చెప్పవచ్చు. అంతేకాకుండా.. ఈయోగం వల్ల విదేశాలకు వెళ్లేవారికి కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా లాటరీలు, ఇంట్లో దాచి ఉంచిన డబ్బులు వీరి సొంతమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలుదొరికే అవకాశం కూడ ఉంటుంది.  

6 /6

కేతు, గురువులు మరింతగా అనుకూలంగా ఫలితాలు ఇవ్వాంటే ప్రతిరోజు రావి చెట్టు నీడలో దీపం పెట్టాలి. నల్లటి చీమలకు చక్కెరను పెట్టాలి. పేదలకు , అన్నార్థులకు అన్నదానం చేయాలి. ఇలా చేస్తే జాతకంల ఎలాంటి దోషాలున్న కూడా పూర్తిగా సమసిపోతాయి.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)