Bihar Assembly Election 2020: బిహార్‌లో ప్రారంభమైన తొలి దశ పోలింగ్.. హేమాహేమీలు వీరే
Bihar Assembly Election 2020 Live Updates | నేడు (అక్టోబర్ 28న) తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బుధవారం 71 స్థానాలకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Election 2020 )నిర్వహిస్తున్నారు.
Bihar Assembly Election 2020 Live Updates | బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు (అక్టోబర్ 28న) తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బుధవారం 71 స్థానాలకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Election 2020 )నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పటిష్టమైన కోవిడ్19 నిబంధనల నడుమ పోలింగ్ ఏర్పాట్లు జరిగాయి. ఓటు వేసేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
- Also Read : Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం
తొలి విడత ఎన్నికల్లో భాగంగా నేడు వెయ్యికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. జేడీయూ - 35 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ - 29, ఆర్జేడీ - 42, కాంగ్రెస్ - 20, ఎల్జేపీ - 41 సీట్లలో బరిలో నిలిచింది. మొత్తం 1066 అభ్యర్థులు పోటీ చేయగా.. అందులో పురుష అభ్యర్థులు 952 మంది ఉండగా, మహిళా అభ్యర్థులు 114 మంది పోటీ చేస్తున్నారు. Also Read : Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ
తొలి విడతలో హేమాహేమీలు వీరే...
బిహార్ కేబినెట్ మంత్రులు విజయ్ కుమార్ సిన్హా (లఖిసరాయ్), ప్రేమ్ కుమార్ (గయ), రామ్ నారాయణ్ మండల్ (బంక), జయ కుమార్ సింగ్ (దినారా), క్రిష్ణ నందన్ ప్రసాద్ వర్మ (జహానాబాద్), సంతోష్‌కుమార్ నిరల (రాజ్‌పూర్), తదితర ముఖ్య నేతలు ఈ దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గయ జిల్లాలోని ఇమామ్ గంజ్ స్థానంపై ఆసక్తి నెలకొంది. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంజీ ఎన్‌డీయే తరఫున పోటీ చేయగా.. ఆర్జేడీ అభ్యర్థిగా ఉదయ్ నారాయణ్ చౌదరి బరిలోకి దిగారు. గత కొన్నేళ్లుగా జేడీయూకు మద్దతుగా ఉన్న నేత అకస్మాత్తుగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలో చేరడం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe