Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. మరో నాలుగు రోజుల్లో 28న బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓ వైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు (BJP-JDU), మరోవైపు మహాఘట్ బంధన్ పార్టీలు ( Congress-RJD-Left) ప్రచారంతో హోరెత్తిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నాయి.

Last Updated : Oct 24, 2020, 09:21 AM IST
Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ

Bihar Assembly election 2020: Tejashwi Yadav Comments: హిసువా (బీహార్): బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. మరో నాలుగు రోజుల్లో 28న బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓ వైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు (BJP-JDU), మరోవైపు మహాఘట్ బంధన్ పార్టీలు ( Congress-RJD-Left) ప్రచారంతో హోరెత్తిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో ఆయా పార్టీల అగ్రనేతలు సైతం ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), కూటమి తరపున కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రచార సభల్లో ప్రసంగించారు. ఈ క్రమంలో రాహుల్‌తో క‌లిసి హిసువాలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. Also read: Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం

రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత, తన తండ్రి లాలు ప్రసాద్‌  వచ్చే నెల 9న బెయిల్‌పై జైలు నుంచి విడుదలవుతారని.. ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు వీడ్కోలు తథ్యమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ జోస్యం చెప్పారు. దాణా కుంభ‌కోణానికి సంబంధించిన మ‌రో కేసులో న‌వంబ‌ర్ 9న త‌న తండ్రి లాలు జైలు నుంచి విడుద‌ల‌వుతార‌ని, అదేరోజు తన పుట్టిన రోజు కూడా అని పేర్కొన్న తేజస్వీ.. ఆ మ‌రుస‌టి రోజే విడుదల కానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలతో సీఎం నితీశ్ కుమార్ వీడ్కోలు ఖాయమని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ విజయం సాధిస్తుందని తేజస్వీ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అవినీతిని రూపుమాప‌డంలో, ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించడంలో సీఎం నితీశ్‌కుమార్ విఫ‌ల‌మ‌య్యార‌ని తేజ‌స్వీ యాద‌వ్ విమ‌ర్శించారు.   Also read: Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం లాలూకు బెయిల్.. కానీ

పశుగ్రాసం కుంభకోణం కేసులో దోషిగా తేలిన తరువాత లాలూ ప్రసాద్ జార్ఖండ్ రాజధాని రాంచీలో జ్యుడీషియల్ కస్టడీలో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే చైబాసా ఖజానాకు సంబంధించిన కేసులో ఆయనకు ఇటీవల జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ దుమ్కా ఖజానా కేసు ఇంకా విచారణలోనే ఉండటంతో ఆయన జైలునుంచి బయటకు రాలేకపోయారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28, నవంబర్‌ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Bihar Assembly election 2020: బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి కరోనా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

More Stories

Trending News