Tejas Rajdhani: రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్నా నుంచి ఢిల్లీ వెళ్తుంది (Rajadhani Express Patna to Delhi).. అది AC కోచ్ కావటంతో అంత ప్రశాంతంగా ఉంది. ఇంతలో ఒక వ్యక్తి లేచి బాత్రూంకు వెళ్లాడు. ఆ బ్యాక్తి బాత్రూంకి వేల్లోచ్చే సరికి పక్క బెర్త్ పై ఉన్న ఒక వ్యక్తి బట్టలు విప్పేసి... బనియన్, అండర్‌వేర్‌పై కనిపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అది చూసిన సదరు వ్యక్తి చేసేదేం లేక.. ఏం అనలేక.. తన బెర్త్ పై కూర్చొన్నాడు. కానీ.. మరో బెర్త్ లో ఉన్న ప్రహ్లాద్ పాసవాన్ (prahlad paswan) అనే యువకుడు ఈ ఘోరాన్ని చూడలేక ప్రశ్నించాడు.. "ఏంటి ఇది..?? ఇక్కడ ఆడవాళ్లు కూడా ఉన్నారు.. కొంచెం మర్యాదగా ప్రవర్తించండి" అంటూ తన కోపాన్ని వెల్లగక్కాడు. 


Also Read: Scary video: పైకప్పులోంచి వేలాడుతున్న "దెయ్యం తల".... తరువాతేం జరిగింది??


అండర్‌వేర్‌పై ఉన్న వ్యక్తి తప్పు చేసిన కూడా ఒప్పుకోకుండా, ఆ యువకుడితో గొడవకు దిగాడు. దాంతో ఆ యువకుడు రైలులో ఉన్న ఆర్పీఎఫ్ (RPF), టీటీఈ (TTE) అధికారులను పిలిచి అతడిపై ఫిర్యాదు చేసాడు. ముందుగా అధికారులు అతడిపై కంప్లైంట్ నోట్ చేద్దాం అనుకున్నారు కానీ... ఆ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. అతను సాదా సీదా ప్రయాణికుడు కాదు... అతడొక ప్రజా నాయకుడు.. ప్రజలతో ఎంపిక చేయబడ్డ బిహార్ ఎమ్మెల్యే! (Bihar JDU MLA Gopal Mandal). 


ఢిల్లీ (Delhi) వెళ్లేందుకు గానూ.. బిహార్‌లో అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్  (జేడీయూ JDU) ఎమ్మెల్యే గోపాల్ మండల్ (MLA Gopal Mandal) రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajadhani Express)ఎక్కారు. ఈ క్రమంలో ఆ ఎమ్మెల్యే వంటిపై దుస్తువలన్ని విప్పేసి..  బనియన్, అండర్‌వేర్‌పైతో కనిపించే సరికి.. సాధారణ ప్రయాణికుడని మిగతా వారంతా ఎమ్మెల్యే గోపాల్ మండల్ అనుచరులతో గొడవకు దిగారు. ఇదంతా చూస్తున్న అధికారులు చేసేదేమీ లేక ఇరువర్గాలకు సర్ది చెప్పి గొడవ పడకుండా చూసారు. 




Also Read: Tokyo Paralympics: భారత్ ఖాతాలో మరో పథకం.. రజతం సాధించిన ప్రవీణ్ కుమార్


ఈ ఘటనకు చెందిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral) అవుతుండగా... ఎమ్మెల్యే మాత్రం కడుపులో బాగలేదని, అందుకే దుస్తులు విప్పానని తనని తాను సమర్థించుకున్నాడు. కానీ నెటిజన్లు మాత్రం సదురు ఎమ్మెల్యేపై విరుచుక పడుతున్నారు. ప్రజా నాయకుడు, ఒక ఎమ్మెల్యే అయి ఉండి, రైల్ లో బట్టలు లేకుండా తిరగటమే కాకుండా అడిగిన తోటి ప్రయాణికులతో గొడవ పడటం చర్చనీయాంశంగా మారింది. 
 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook