Biplav Kumar Deb Resigns: త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఎస్‌.ఎన్. ఆర్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఢిల్లీ వెళ్లి కలిసిన రెండ్రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేయడం కీలకంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిప్లబ్ కుమార్ దేబ్‌కు వ్యతిరేకంగా పార్టీలో అసమ్మతి పెరగడం.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ..ఆయన్ను అధిష్టానం పక్కన పెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


2020 డిసెంబర్‌లో త్రిపురకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి బిప్లబ్ పై అమిత్ షా, నడ్డాలకు ఫిర్యాదు చేశారు. పార్టీలో సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. బిప్లబ్‌పై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నట్లు  అసమ్మతి నేతలకు ప్రాతినిధ్యం వహించిన సుదీప్ రామ్ బర్మన్ ప్రకటించడం అప్పట్లో కలకలం రేపింది. బిప్లబ్ నియంతలా వ్యవహరిస్తున్నారనీ.. ప్రభుత్వాన్ని నడపడం ఆయనకు చేతకావడం లేదని అధిష్టానికి ఫిర్యాదు చేశారు.


2023 మార్చిలో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఇలాంటి తరుణంలో పార్టీలో అసమ్మతి పెరగడం మంచిది కాదని బీజేపీ అధిష్టానం భావించిందంటున్నారు. దాంతో బీజేపీ పెద్దల ఆదేశంతోనే బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన తర్వాత.. మీడియాతో బిప్లబ్ మాట్లాడారు. త్రిపుర కోసం పని చేశానన్నారు. పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.


మరోవైపు ముఖ్యమంత్రి రేస్‌ లో డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మ, రాజ్యసభ ఎంపీ డా. మానిక్ సాహాల పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ శాసన సభా పక్ష నేతలు సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే.. కేంద్ర పరిశీలకులుగా రాష్ట్రానికి రానున్నారు.


Also Read: Domestic Violence Case: ఇంట్లో గోడ.. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని మనవడిపై గృహహింస కేసు


Also Read: Revanth Reddy Letter to Amit shah: అమిత్ షాకు తొమ్మిది ప్రశ్నలు .. రేవంత్ ఘాటు లేఖ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook