Domestic Violence Case: ఇంట్లో గోడ.. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని మనవడిపై గృహహింస కేసు

Domestic Violence Case: ప్రముఖ స్వీట్ల వ్యాపారవేత్త జి.పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. తన భార్య బయటకు రాకుండా రాత్రి రాత్రే ఆమె గదిలో ఏక్‌నాథ్‌రెడ్డి గోడ కట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 03:46 PM IST
  • జి.పుల్లారెడ్డి మనవడిపై గృహహింస కేసు
  • భార్యను నిర్బంధించేందుకు ఇంట్లోనే గోడ నిర్మాణం
  • పోలీసుల సాయంతో బయటపడ్డ బాధితురాలు
Domestic Violence Case: ఇంట్లో గోడ.. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని మనవడిపై గృహహింస కేసు

Domestic Violence Case: దేశంలో గృహహింస ఘటనలు పెరుగుతున్నాయి. భార్యను హింసించడం, భౌతిక దాడులు చేయడం లాంటి ఉదంతాలు ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబ సభ్యుడిపై గృహహింస ఆరోపణలు వచ్చాయి. భార్యను బందించేందుకు ఇంట్లోనే గొడ కట్టడం కలకలం రేపింది.

ప్రముఖ స్వీట్ల వ్యాపారవేత్త జి.పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. తన భార్య బయటకు రాకుండా రాత్రి రాత్రే ఆమె గదిలో ఏక్‌నాథ్‌రెడ్డి గోడ కట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు మధ్య బాధితురాలని కాపాడారు.

గత కొంత కాలంగా ఏక్‌నాథ్ రెడ్డి అతడి భార్య మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. భార్యను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఏక్‌నాథ్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. కలసి ఉండలేక బయటపడేందుకు అతడి భార్య చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గొడవలు మరింత ముదిరాయి.

ఇంట్లోనే ఆమెను ఉంచి బయటకు రాకుండా గోడ కట్టి .. రూమ్‌కు లాక్‌ వేసి ఏక్‌నాథ్ రెడ్డి వెళ్లిపోయాడు. పై అంతస్తు నుంచి కిందకు రాకుండా మెట్ల మార్గాన్ని మూసేసేందుకు ఇటకలతో గోడను నిర్మించాడు. అక్కడి నుంచి బయటకు ఎలా రావాలో తెలియని బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసుల సాయంతో బయటపడింది.

 తన తండ్రితో కలిసి పోలీసులకు భర్త ఏక్‌నాథ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జి.పుల్లారెడ్డి కుమారుడి కొడుకైన ఏక్‌నాథ్‌రెడ్డిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Also Read: Eyes Care Tips: తరచుగా కనురెప్పలలో దురద..మంటగా ఉందా..అందుకు కారణలేంటో తెలుసుకోండి

Also Read: New Job Suggestions: కొత్త కంపెనీకి వెళ్తున్నారా .. అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News