కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. అల్వార్ ఘటనలో గోరక్షణ పేరిట ఓ వ్యక్తిని అనుమానంతో హతమార్చిన ఘటన గురించి మాట్లాడుతూ రాహుల్... మోదీ సర్కారుపై మండి పడిన క్రమంలో స్మృతి ఇరానీ పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం సామాజిక బంధాలకు తిలోదికాలు ఇవ్వవద్దని ఆమె రాహుల్‌కి హితవు పలికారు. రాబందు రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. చరిత్ర మరిచిపోలేని 1984 సిక్కుల ఊచకోత ఘటనకు కారణమైన కాంగ్రెస్.. ఈ రోజు హింస గురించి మాట్లాడుతుందని అన్నారు. స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేయకముందు రాహుల్, మోదీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్వార్ ఘటనలో దాడికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పోలీసులు టీ బ్రేక్ తీసుకున్నారని.. మోదీ హయాంలో కొందరు మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి ద్వేషంతో రగిలిపోతున్నారని.. జనాలు మరణిస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత పీయూష్ గోయల్ కూడా తన వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీని ద్వేషపూరితమైన వర్తకుడిగా ఆయన పేర్కొన్నారు. మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని తెలిపారు.


"నేరపూరితమైన సంఘటనలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఆనందంతో చిందులు వేయద్దు రాహుల్‌జీ. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం చాలా పకడ్బందీగా వ్యవహరిస్తుందని తెలుసుకోండి. ఎన్నికలలో ఫలితాలను పొందడం కోసం సమాజాన్ని విభజించాలని భావించవద్దు. ఇప్పటి వరకు మీ వల్ల జరిగింది చాలు. నువ్వు ద్వేషానికి వర్తకుడిగా మారుతున్నావు" అని పీయూష్ గోయల్ తెలిపారు.