Metro man sridharan: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణాదిన పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కేరళపై కన్నేసింది. అందుకే క్లీన్ ఇమేజ్ ఉన్న మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ప్రచారంలో దిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఇప్పటికే ప్రచార పర్వం ఊపందుకుంది. దక్షిణాదిన పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకు తమిళనాడు(Tamilnadu) అంత అనువైంది కాదు. ఎందుకంటే తమిళనాట ఎప్పుడూ ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది. ఈ నేపధ్యంలో కేరళ(Kerala)పై దృష్టి సారించింది. ఇటీవలే బీజేపీ తీర్ధం పుచ్చుకున్న మెట్రోమ్యాన్ శ్రీధరన్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్ ‌వాడుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కేరళ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా శ్రీధరన్(Metro man sridharan as kerala cm candidate)పేరును ప్రకటించింది బీజేపీ. కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 


అటు శ్రీధరన్ కూడా బీజేపీ అధికారంలో వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమేనని ఇటీవలే ప్రకటించారు. శ్రీధరన్(Sridharan)‌కు ఉన్న క్లీన్ ఇమేజ్ తమ పార్టీకు కలిసొస్తుందనేది బీజేపీ నమ్మకం. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించలేదని..ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకముందని శ్రీధరన్ తెలిపారు. ఈసారి బీజేపీ (BJP)అధికారంలో వస్తుందనేది తన నమ్మకమని అన్నారు. తాను నివసిస్తున్న మలప్పురం పొన్నానికి సమీపంలో ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నానని చెప్పారు. అయితే ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగే సాంప్రదాయాన్ని తాను పాటించనంటున్నారు శ్రీధరన్.  ఇళ్లకు, దుకాణాలకు, ఊర్లకు ఓట్ల కోసం వెళ్లనని..తన సందేశం మాత్రం ఓటర్లందరికీ చేరుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 88 ఏళ్ల శ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి.  మరి శ్రీధరన్ ఆలోచన, క్లీన్ ఇమేజ్ బీజేపీకు ఈసారి ఏమేరకు కలిసొస్తుందో చూడాల్సి ఉంది. 


Also read: EPF Interest rate: ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook