Assembly Elections: బీజేపీ త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశంలో ఐదు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ  ( Bjp ) ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ( Tamil nadu assembly elections ) రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Bjp president Jp nadda )..ఈ రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్, కో ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. 


అస్సోం రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ( Narendra singh thomar ), కో ఇన్‌ఛార్జ్‌గా డాక్టర్ జితేంద్ర సింగ్‌ను నియమించారు. అటు తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ( Kishan reddy )ని, ఆర్మీ మాజీ ఛీఫ్ జనరల్ వీకే సింగ్‌ను కో ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. కేరళ ఎన్నికల బాధ్యతను ప్రహ్లాద్ జోషికి, కో ఇన్‌ఛార్జ్‌గా కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్ నారాయణ్‌ను నియమించారు. పుదుచ్చేరి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అర్జున్ రామ్ మేఘవాల్‌ను, కో ఇన్‌ఛార్జ్‌గా రాజీవ్ చంద్రశేఖర్‌ను నియమించారు. 


పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ( Mamata Banerjee ) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు తమిళనాడులో ఏఐఏడీఎంకే ( AIADMK )తో పొత్తు కుదుర్చుకుని అధికారంలో వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కేరళలో పట్టు సాధించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.


Also read: FASTag: ఫిబ్రవరి 15 ఫాస్టాగ్ చివరి తేదీ..ఇక పొడిగింపు లేదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook