2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. నితీష్ తో భేటీ అనంతరం షా మీడియాతో  మాట్లాడుతూ జేడీయూ తమకు విలువైన మిత్రపక్షమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్ని ప్రాంతీయ పార్టీలు కలిసినా తమను ఓడించలేరన్నారు. యావత్ భారతంలో బీజేపీ పాలన వచ్చేలా చేసేందుకు క్షేత్ర స్థాయిలో కృషి చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమితో నితీశ్ ఇమడలేకపోతున్నారని..ఆయన తిరిగి కాంగ్రెస్ కూటమిలోకి వెళ్లనున్నారని వస్తున్న వార్తలను అమిత్ షా ఖండించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు స్థానంలో నితీష్ 


ఈ సందర్భంగా చంద్రబావబు అంశంపై స్పందిస్తూ ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు నితీష్ కుమార్ ఉన్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడంతో వచ్చిన నష్టమేని లేదన్నారు. ఆ నష్టాన్ని మిగిలిన పార్టీలతో భర్తీ చేయగలమన్నారు


మిత్రపక్షాల సమన్వయం చేసుకున్న పనిలో ఉన్న బీజేపీ చీఫ్ అతిమ్ షా గురువారు బీహార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పట్నాలోని ప్రభుత్వ అతిథి గృహంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో భేటీ అయిన అమిత్ షా.. అల్పాహార విందు స్వీకరించారు. ఆపై బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మరల నితీష్ కుమార్ తో భేటీ నిర్వహించి వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యూహం, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం నితీష్ కుమార్ తో కలిసి అమిత్ షా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.