Clashes between BJP, Congress workers: భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హింసాకాండ చెలరేగింది. మంగళవారం ఉప ఎన్నికలు జరగనున్న బద్నవర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ( Badnawar Assembly constituency ) బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. జిల్లా కేంద్రం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిలగడలో ( Tilagara ) అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1 గంటలకు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలతో వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఎదురు వచ్చాయని, ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసిందని జిల్లా ఎస్పీ ఆదిత్యప్రతాప్ సింగ్ తెలిపారు. Also read : Mukesh Ambani loses $5 billion: ముకేశ్ అంబానీకి 5 బిలియన్స్ డాలర్స్ నష్టం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపి ( BJP ), కాంగ్రెస్ పార్టీల ( Congress ) కార్యకర్తల మధ్య జరిగిన ఈ ఘర్షణలో "ఆరుగురు గాయపడ్డారు. ఏడుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇప్పటికే నలుగురిని గుర్తించారు" అని సింగ్ తెలిపారు. గుర్తించిన నలుగురు వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. 


ఇదిలావుంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి కుల్దీప్ సింగ్ బుండేలా ( Kuldeep Singh Bundela ) పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని కుల్దీప్ సింగ్ ఆరోపించారు. "బిజెపి కార్యకర్తలే హింసకు పాల్పడ్డారని.. కాని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేశారు" అని బుండేలా మండిపడ్డారు. Also read : TS ICET 2020 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


మరోవైపు బిజెపి నాయకుడు గోవింద్ మాలూ ( BJP leader Govind Maloo ) ఈ ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారని గోవింద్ మాలూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మంగళవారం 28 స్థానాలకు బైపోల్స్ ( Bypolls in Madhya Pradesh ) జరగనున్న నేపథ్యంలో జరిగిన ఈ ఘటన రెండు పార్టీల మధ్య వైషమ్యాలు తారాస్థాయికి చేరాయని చెప్పేందుకు ఓ ఉదాహరణగా నిలిచింది. Also read : Ravula Sridhar Reddy: టీఆర్ఎస్‌లో చేరిన రావుల శ్రీధర్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe