TS ICET Results 2020: తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

TS ICET 2020 Results | తెలంగాణ ఐసెట్‌ - 2020 పరీక్షా ఫలితాలు (TS ICET 2020 Results) వచ్చేశాయ్. తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలను మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి విడుదల చేశారు. ​

Last Updated : Nov 2, 2020, 04:04 PM IST
  • తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలు విడుదల
  • ఐసెట్ ఫలితాలు విడుదల చేసిన ప్రొ. పాపిరెడ్డి
  • అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు
TS ICET Results 2020: తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

TS ICET 2020 Results Declared at tsche.ac.in | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ - 2020 ఫలితాలు (TS ICET 2020 Results) వచ్చేశాయ్. ఫైనల్ కీ, తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలను మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఐసెట్ కన్వినర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి వెల్లడించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని కామర్స్ ప్రాంగణంలో ఫలితాలు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు (TS ICET 2020 Results) మరికాసేపట్లో అందుబాటులోకి రానున్నాయి.

టీఎస్ ఐసెట్ 2020 ఫలితాలు కోసం అధికారిక వెబ్‌సైట్ - https://icet.tsche.ac.in/TSICET/TSICET_GetRankCard2K.aspx

 

సెప్టెంబర్ నెల 30, అక్టోబర్ 1వ తేదీలలో టీఎస్ ఐసెట్ - 2020 ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష ఫలితాలు (Telangana ICET 2020 Results) ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి విడుదల చేశారు. తెలంగాణ ఐసెట్ 2020 పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 58,452 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షలకు 45,975 మంది హాజరయ్యారు.

టీఎస్‌ ఐసెట్ - 2020‌ ఫలితాలు కోసం క్లిక్ చేయండి
 

తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ, తెలంగాణ విద్యార్థులు దరఖాస్తులు చేసుకుని పరీక్షకు హాజరయ్యారు. మొత్తం రెండు రాష్ట్రాలలో 70 కేంద్రాలలో టీఎస్ ఐసెట్ నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News