Komatireddy Raja gopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారు..! సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాజ్ గోపాల్ రెడ్డి.. రీసెంట్గా నకిరేకల్ సభలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి కోసమే రాజ్ గోపాల్ రెడ్డి సీఎం రేవంత్ కు దగ్గరవుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు గీత దాటితే వేటు తప్పదన్న భయంతోనే వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. ..! ఇంతకీ రాజన్న యూటర్న్ వెనుక అసలు స్టోరీ ఏంటో చూద్దాం.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల పంపకాలపై రచ్చ మొదలైందా..! కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాక.. ముగ్గురు మహిళ నేతలకు పదవులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయా..! కే.కేశవరావు కుటుంబంలో ఒకే ఇంట్లో ఇద్దిరికీ కేబినెట్ హోదా ఎలా ఇస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారా..! అటు కుడా చైర్మన్ పదవి నియామకంపై కాంగ్రెస్‌లో రచ్చ జరుగుతోందా..! మున్నురు కాపు కోటాలో పదవులు దక్కించుకున్న నేతలపై సొంత పార్టీ నేతలే ఎందుకు ఫైర్ అవుతున్నారా..! దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి..!
KTR Harish Rao Assembly Black Shirt: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తంచేస్తూ నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వెళ్లడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాట, రణరంగం లాంటి వాతావరణంలో కేటీఆర్ తల, నుదురు, చేతికి గాయలైనట్లు తెలిపారు. హరీశ్ రావు, మరికొందరు శాసనసభ్యుల చొక్కాలు చిరిగిపోయాయి. ఈ క్రమంలో కేటీఆర్ గాయాల కోసం సూదిమందు తీసుకున్నారు.
Harish Rao Black Shirt Protest: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తంచేస్తూ నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద నిరసన చేపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు నల్ల చొక్కాను విప్పించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలను ఈడ్చుకెళ్లినట్లు ఆ నేతలు ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Konda Surekha Jagadeesh Reddy News: మాజీ మంత్రి కొండా సురేఖ త్వరలోనే కాంగ్రెస్ పార్టీని విడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. మంత్రి పదవి నుంచి ఆమెకు అధికార కాంగ్రెస్ పార్టీ బర్త్‌రఫ్ చేయగా.. ఈ క్రమంలో ఆమె పార్టీ మారే ఛాన్స్ ఉందని, త్వరలోనే ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీ గేటు కూడా తాకనివ్వమని ఆయన స్పష్టం చేశారు.
Konda Surekha BJP News: మాజీ మంత్రి కొండా సురేఖ తన పేరుతో సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ఒక విస్తృత ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ పేరుతో ఉన్న ఒక ఫేస్బుక్ ఖాతాలో 'త్వరలో బిగ్ అప్డేట్ ఉంటుంది' అంటూ వచ్చిన ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారడంతో ఆమె స్పందించారు. ఆ పోస్టులకు, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
Konda Surekha Big Update: మాజీ మంత్రి కొండా సురేఖ తన పేరుతో సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ఒక విస్తృత ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ పేరుతో ఉన్న ఒక ఫేస్బుక్ ఖాతాలో 'త్వరలో బిగ్ అప్డేట్ ఉంటుంది' అంటూ వచ్చిన ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారడంతో ఆమె స్పందించారు. ఆ పోస్టులకు, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Ponguleti Srinivas Reddy: ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై తెలంగాణ సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలను ప్రస్తుతం అమలు చేయలేకపోతున్నామని.. దానికి ప్రధాన కారణం నిధుల కొరతలేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగానే అంగీకరించారు. ప్రభుత్వ ఖజానాలో సరిపోయే నిధులు లేవని.. అందుకే కొన్ని హామీల అమలులో ఆలస్యం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
Brs released congress 1000 days chargesheet: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ ప్రభుత్వం చార్జీషీట్ ను విడుదలచేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసింది ఒక్కటీ లేదని ఏకీపారేశారు. ఇది పాలన కాదు.. ప్రజా పీడన అని, ఈ 1000 రోజులు క్రిమినల్ వేస్ట్.. ఈ 1000 రోజులకు ఉన్న విలువ జీరో అని చెప్పారు. అబద్ధం, అజ్ఞానం, అరాచకం, అవినీతి.. నాలుగు తలలతో బుసలు కొడుతున్న అనుముల నాగుపాము పాలన ఈ 1000 రోజుల పాలన అని, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనికి నేటితో 1000 దినాలని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Ramchander Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ‘క్యూఆర్’ పేరుతో హైదరాబాద్‌ను లూటీ చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Election Commission Released Telangana SIR Draft: తెలంగాణలో ఓటర్ జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2.64 కోట్ల మంది ఓటర్లు ఫామ్‌లు నింపారని.. 9.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందారని ఎన్నికల సంఘం వెల్లడించింది. నిజమైన ఓటర్లు ఉంటే వారికి చివరి అవకాశం కల్పిస్తున్నట్లు ఈసీ తెలిపింది.
FCRA Bill: పార్లమెంట్ సమావేశాలు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. ఇవాళ సభముందు విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల ఆందోళన మధ్య పార్లమెంట్ అట్టుడుకుతోంది. ఇవాళ FCRA బిల్లు సభ ముందుకు రానుండటంతో ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు కేంద్రం ఈ బిల్లును ఎలాగైనా ఆమోదించేందుకు..ప్రతిపక్ష ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే వారితో చర్చలు జరిపింది.
Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. నేడు పార్లమెంట్ సెషన్స్ రీస్టార్ట్ కానుండగా.. ఈ నెల 13న సమావేశాలు ముగియనున్నాయి. సమావేశాలు ఇంకా నాలుగు రోజులే జరగనుండగా.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కీలక బిల్లులు ఇప్పటికీ ఆమోదం పొందలేదు. వీటిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Komatireddy Venkat Reddy Interesting Comments About Next Elections In Nalgonda
Komatireddy Venkat Reddy Interesting Comments On Next Elections: మరోసారి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిపిస్తామంటేనే ఎన్నికల్లో పోటీ చేస్తా.. లేదంటే లేదని స్థానికులతో చెప్పారు. ఆ హామీ ఇవ్వాలని తన స్వగ్రామస్తులను కోరారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
CM Revanth Reddy: శ్రీశైలం ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. "అలా చేసినందుకు నేను విద్యాశాఖను వదులుకోవాలా?" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలు, శ్రీశైలం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిణామాలపై పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి.
Siddaramaiah Retirement News: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 2028లో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సిద్ధరామయ్య ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. వయసు మీద పడడం, ఆరోగ్యంతోపాటు అవినీతి రాజకీయాలు పెరిగిపోతుండటం కారణంగా తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు.
Siddaramaiah Say Good Bye To Direct Politics At Age Of 79: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తాను ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.
School Uniform Quality WhatsApp Feedback: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ క్వాలిటీ విషయంలో రాజీపడబోమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. విద్యార్థుల యూనిఫామ్స్ పై అధికారులతో సీఎం సమీక్షించారు.
DK Aruna Interview: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని.. త్వరలో అధికారంలోకి కచ్చితంగా వస్తామన్నారు.
Health cards: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య భరోసాను ఇచ్చే ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ స్కీమ్ ముహూర్తానికి ముందే బ్రేక్ పడింది.
Unemployed JAC Protest: తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ ఇందిరాపార్క్ వేదికగా మహాధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ప్రతి ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు అధికారికంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందంటూ ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించారు.