Maharashtra crisis: ప్రభుత్వాల కూల్చివేతల్లో బీజేపీ కొత్త రికార్డ్.. మహారాష్ట్ర తర్వాత రాజస్థానేనా?
Maharashtra crisis: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో పడింది.మహారాష్ట్ర పరిణామాలతో బీజేపీ తీరుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది
Maharashtra crisis: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో పడింది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉద్దవ్ సర్కార్ పతనం అంచుకు చేరింది. మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీరణ ప్రభుత్వం ఉంది. మూడు పార్టీల మహా వికాస్ అగాధి కూటమికి 169 ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే తిరుగుబాటు చేసిన మంత్రి శివసేన నేత ఏక్ నాథ్ షిండే గ్రూపులో 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఏక్ నాథ్ షిండే సారథ్యంలో క్యాంపుకు వెళ్లారని చెబుతున్నా... వెనకుండి నడిపిస్తుంది మాత్రం బీజేపీనే అంటున్నారు. షిండే క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తే.. ఉద్దవ్ సర్కార్ కూలిపోవడం ఖాయం. శివసేన రెబెల్ ఎమ్మెల్యేల సపోర్టుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఫడ్నవీస్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటీకే ఢిల్లీ చేరిన ఫడ్నవీస్... పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
మహారాష్ట్ర పరిణామాలతో బీజేపీ తీరుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచినా... కొందరు ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడేలా చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కూటముల్లో చిచ్చు పెట్టి.. కమలం జెండా ఎగిరేలా పావులు కదిపింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి.. బీజేపీ సర్కార్ ఏర్పడేలా లైన్ క్లియర్ చేసుకుంది మోడీ, అమిత్ షా టీమ్. 2014లో జరిగిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఎన్నికల్లో బీజేపీకి 11 సీట్లు రాగా.. కాంగ్రెస్ నుంచి 42 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట కాంగ్రెస్ సర్కారే ఏర్పడింది.కొంత కాలానికే బీజేపీ చక్రం తిప్పింది. ఏకంగా కాంగ్రెస్ సీఎం సహా 42 మంది ఎమ్మెల్యేలను లాగేసుకుంది. ఒక్క రోజులోనే అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తా బీజేపీ సర్కార్ గా మారిపోయింది. 2014లో కశ్మీర్ లో బీజేపీకి 25 సీట్లు, పీడీఎఫ్ కి 28 సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేశాయి. కొంత కాలానికే కమలం పార్టీ సీన్ మార్చేసింది. మద్దతు ఉపసహిరించుకుని పీడీఎఫ్ సీఎంను కూల్చేసింది. తర్వాత రాష్ట్రపతి పాలన విధించి కశ్మీర్ లో కేంద్ర పాలన సాగేలా చేసింది. 2016లో ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేసింది బీజేపీ. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ హ్యాండిచ్చారు. దీంతో ప్రభుత్వం పడిపోయింది. తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టింది బీజేపీ.
బీహార్ లోనూ అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కింది. 2015లో జేడీయూ, ఆర్జేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2017లో బీజేపీ తన ఆపరేషన్ నిర్వహించింది. నితీష్ ను తమవైపునకు తిప్పుకుంది. ఆర్జేడీకి టాటా చెప్పి బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2018లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. దక్షిణాదిలో తమకు పట్టున్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో ఎలాగైనా పాగా వేయాలని ప్లాన్ చేసిన కమలనాథులు.. జేడీఎస్ ను చీల్చేసింది. 16 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కొన్ని కుమారస్వామి సర్కార్ ను కూలగొట్టింది. తర్వాత యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు.2020లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 121 సీట్లు గెలిచి మేజిక్ ఫిగర్ సాధించింది. కమల్ నాధ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిన్నర కాకుండానే కాంగ్రెస్ సీనియర్ నేతను తమవైపు లాక్కుంది బీజేపీ. 26 మంది ఎమ్మెల్యేతో జ్యోతిరాదిత్య తిరుగుబాటు చేసేలా చేసింది. ఆ 26 మంది ఎమ్మెల్యేలతో గేమ్ ఆడి కమల్ నాథ్ సర్కార్ ను పడగొట్టింది. తర్వాత 2020 మార్చిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.
2017లో మణిపూర్ లో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వచ్చినా.. గవర్నర్ తో గేమ్ అడించింది బీజేపీ. 60 సీట్లకు గాను కాంగ్రెస్ కి 28 సీట్లలో గెలిచింది. అయితే అతిపెద్ద పార్టీని కాదని 21 మంది సభ్యులున్న బీజేపీని గవర్నర్ ఆహ్వానించారు. తర్వాత కాంగ్రెస్ ని చీల్చింది. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపునకు లాక్కుని ప్రభుత్వాన్నిఏర్పాటు చేసింది బీజేపీ. గోవాలో ఇప్పటివరకు బీజేపీకి మెజార్టీ రాలేదు, కాని ప్రతిసారి వాళ్లదే పవర్. 2017లో జరిగిన ఎన్నికల్లో గోవాలో కాంగ్రెస్ కి 17, బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీగా నిలిచినా కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా.. గవర్నర్ తో గేమ్ అడించింది. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేను లాగేసింది. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండెళ్ళ తరువాత మరో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసుకుని.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా చేసింది బీజేపీ.
మహారాష్ట్ర పరిణామాలతో బీజేపీ తర్వాత టార్గెట్ రాజస్థానే అంటున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ పార్టీకి మెజార్టీ కన్నా కొన్ని సీట్లే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ ను లాగాలని చూసిన వర్కవుట్ కాలేదు. మహారాష్ట్ర తర్వాత రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Also Read: AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.